Begin typing your search above and press return to search.

ప్రేమలు బ్యూటీ.. కల నిజమైన వేళ..!

స్టార్ హీరోలతో నటిస్తే వచ్చే ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని స్టార్ సినిమా ఆఫర్ వస్తే చాలు కథానాయికలు ఎగిరి గంతులేస్తుంటారు

By:  Tupaki Desk   |   17 Jan 2025 10:30 PM GMT
ప్రేమలు బ్యూటీ.. కల నిజమైన వేళ..!
X

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్టార్స్ తో నటించాలనే కోరిక ఉంటుంది. స్టార్ హీరోలతో నటిస్తే వచ్చే ఆ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని స్టార్ సినిమా ఆఫర్ వస్తే చాలు కథానాయికలు ఎగిరి గంతులేస్తుంటారు. ఐతే అది కెరీర్ ఎర్లీగా ఆ ఛాన్స్ వస్తే మాత్రం ఇక ఆ హీరోయిన్స్ ఆనందానికి అవధులు ఉండవు. ప్రస్తుతం అలాంటి ఒక హ్యాపీ మూమెంట్ లోనే ఉంది ప్రేమలు హీరోయిన్ మమితా బైజు.

మలయాళంలో ఆల్రెడీ ఏడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్న అమ్మడు ప్రేమలు సినిమాతో సౌత్ ఆడియన్స్ కు హాట్ ఫేవరేట్ గా మారింది. ముఖ్యంగా అమ్మడి క్యూట్ లుక్స్ ని కుర్రాళ్లంతా కూడా ఫిదా అయ్యారు. ప్రేమలు సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు వరుస ఛాన్సులు అందుకుంటుంది. ముఖ్యంగా కోలీవుడ్ లో స్టార్ హీరో దళపతి విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. విజయ్ 69వ సినిమాగా వస్తున్న సినిమా విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఐతే రీసెంట్ గా ఒక బుల్లితెర ఈవెంట్ లో పాల్గొన్న మమితా బైజు దళపతి విజయ్ సినిమాలో నటించడం గురించి సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నానని డ్రీం నిజమైందని అన్నది. అంతేకాదు ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. విజయ్ సర్ తో నటించడం లైఫ్ లో ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పింది మమితా బైజు.

ప్రేమలు సినిమాతో యూత్ ఆడియన్స్ కు దగ్గరైన మమితా రాబోతున్న సినిమాలతో కూడా మరింత క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. తప్పకుండా మమితాకు మంచి కెరీర్ ఉంటుందని చెప్పొచ్చు. ఐతే మమితా విజయ్ 69 సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా లాక్ అయ్యింది. హెచ్. వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ 69వ సినిమా నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అన్న టాక్ నడుస్తుంది. ఐతే ఈ విషయాన్ని ఇంకా ఆ చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు.