ఒక్క హిట్‌తో ఆమె ఖాతాలో అర డజను సినిమాలు..!
మలయాళ సినిమా ప్రేమలుతో ఒక్కసారిగా ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకు ముందు అయిదు సంవత్సరాలుగా మలయాళ సినిమాల్లో నటిస్తూనే ఉంది.
By: Tupaki Desk | 19 March 2025 1:59 PM ISTకొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. కానీ కొందరు మాత్రం ఒక్క హిట్‌తో ఓవర్ నైట్ స్టార్స్ అవుతారు. దాంతో ఒకేసారి నాలుగు అయిదు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటారు. ఇప్పుడు మమిత బైజు అదే జోరులో ఉంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఎక్కువ సినిమాల్లో నటించేందుకు అవకాశాలను దక్కించుకుంది. మలయాళ సినిమా ప్రేమలుతో ఒక్కసారిగా ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకు ముందు అయిదు సంవత్సరాలుగా మలయాళ సినిమాల్లో నటిస్తూనే ఉంది. కానీ అవేవి మమితకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కానీ ప్రేమలు హిట్‌తో మొత్తం పరిస్థితి మారి పోయింది.
మలయాళంలో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. కేవలం మలయాళ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా కోలీవుడ్ నుంచి ఈమెకు మూడు నాలుగు ఆఫర్లు తలుపు తట్టాయి. అందులో ముఖ్యంగా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న జన నాయగన్ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల పోషించిన పాత్రను జన నాయగన్ సినిమాలో మమితా పోసిస్తుందని సమాచారం అందుతోంది. ఆ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ రాలేదు. విజయ్ సినిమాలో ఏ పాత్రలో నటించినా కోలీవుడ్‌లో టాప్ స్టార్‌గా గుర్తింపు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.
జన నాయగన్ సినిమా విడుదలకు ముందే ఇరండు వానం సినిమాలో ఎంపిక అయింది. ఆ సినిమా షూటింగ్ సైతం స్పీడ్‌గా జరుగుతోంది. ఇదే సమయంలో ప్రేమలు 2 సినిమాకు కమిట్ అయింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేయబోతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా మమిత బైజు ఎంపిక అయిందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటి విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించబోతున్న ధనుష్ సినిమాలో మమిత హీరోయిన్‌గా నటించడం కన్ఫర్మ్ అయిందని కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కోలీవుడ్‌లో మమిత జోరు చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోనూ ఈమెకు ఆఫర్లు తలుపు తడుతున్నాయి.
ఆ మధ్య మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రదీప్ రంగనాథ్ హీరోగా ఒక సినిమా కన్ఫర్మ్ అయింది. ఆ సినిమాలో హీరోయిన్‌గా మమితను ఎంపిక చేయాలని నిర్ణయించారు. తెలుగుతో పాటు తమిళ్‌లో ఏక కాలంలో ఆ సినిమాను రూపొందించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ప్రదీప్ రంగనాథ్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ సినిమాలో మమితకి ఛాన్స్ రావడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం. మొత్తానికి ఒక్క ప్రేమలు సినిమా విజయంతో అరడజనుకు పైగా సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్‌లో మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.