ఆ బ్యూటీ లైనప్ లో అంతా సూపర్ స్టార్లే!
మెయిన్ లీడ్ లో పూజాహెగ్డే నటిస్తుండగా...సెకెండ్ లీడ్ దక్కించుకుంది.
By: Tupaki Desk | 28 March 2025 11:30 PMకొచ్చి బ్యూటీ `ప్రేమలు`తో తెలుగులో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఒక్క హిట్ అమ్మడికి రెండు భాషల్లో అవకాశాలు తెచ్చి పెడుతుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. కోలీవుడ్ లో ఏకంగా స్టార్ హీరోలతోనే ఛాన్స్ లందుకుంటుంది. ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తోన్న 'జన నాయగన్' లో సెకెండ్ లీడ్ పోషిస్తుంది. మెయిన్ లీడ్ లో పూజాహెగ్డే నటిస్తుండగా...సెకెండ్ లీడ్ దక్కించుకుంది.
ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ధనుష్, సూర్య సరసన కూడా కొత్త సినిమాలకు సైన్ చేసిందని సమా చారం. ధనుష్ హీరోగా 'ఫోర్ థోజిల్' ఫేం విగ్నేష్ రాజా ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా మమితా బైజు అయితే బాగుంటుందని ఆమెకి స్టోరీ చెప్పి లాక్ చేసినట్లు సమాచారం. అలాగే సూర్య హీరోగా నటించనున్న మరో కొత్త చిత్రంలోనూ ఈ భామనే హీరోయిన్ గా చర్చలు జరుపుతున్నారుట.
ఇదంతా 'ప్రేమలు' చిత్రంతో వచ్చిన గుర్తింపుతోనే సాధ్యమవుతుంది. మాలీవుడ్ భామలు సౌత్లో సెంటిమెం ట్ గానూ మారిపోతున్నారు. ముంబై మోడల్స్ కంటే? కేరళ కుట్టీలు నటిస్తే ఆసినిమా హిట్ అవుతుందనే సెంటిమెంట్ మూడు నాలుగేళ్లగా బాగా వర్కౌట్ అవుతుంది. ఈనేపథ్యంలో గత నాలు గైదేళ్లగా ఎక్కువగా మాలీవుడ్ అందాలు దిగుమతి అవుతున్నాయి. నటన పరంగానూ నేచురల్ గా ఉంటుంది.
కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతో నూ రాణించొచ్చు అని కొంత మంది భామలు ప్రూవ్ చేయడంతో? మాలీవుడ్ బ్యూటీలకు తెలుగు, తమిళ దర్శకులు పెద్ద పీట వేస్తున్నారు. దానికి సక్సెస్ తోడైంది అంటే అమ్మడి కెరీర్ కి తిరుగుంటం లేదు. టాలీవుడ్ ...కోలీవుడ్ నుంచి నేరుగా బాలీవుడ్ కి ప్రమోట్ అవు తున్నారు. రష్మిక, కీర్తి సురేష్, సమంత బాలీవుడ్ కి అలా వెళ్లిన వారే.