ప్రేమలు పాప.. తెలుగులో క్రేజీ జాక్ పాట్?
అయితే ప్రేమలు సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ కావడంతో తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయిపొయింది.
By: Tupaki Desk | 9 April 2024 12:03 PMప్రేమలు సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయిన మలయాళీ ముద్దుగుమ్మ మమిత బైజు. ఈ బ్యూటీ ఇప్పటికే మలయాళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే ప్రేమలు సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి రిలీజ్ కావడంతో తెలుగు ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయిపొయింది. ఆమె స్మైల్ కి యూత్ కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు.
దీంతో టాలీవుడ్ నుంచి ఈ మలయాళీ బ్యూటీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అఫీషియల్ ఒక్కటి కూడా ఎనౌన్స్ కాకపోయిన బడా నిర్మాతలు మమిత బైజుని టాలీవుడ్ కి పరిచయం చేయడం కోసం అడ్వాన్స్ లు ఇస్తున్నారని టాక్. ఇదిలా ఉంటే సితార ఎంటర్టైన్మెంట్స్ లో కూడా అమ్మడికి ఆఫర్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అది కూడా రౌడీ స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో పీరియాడికల్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోందని టాక్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా ముందుగా శ్రీలీలని ఎంపిక చేశారు.
అయితే తరువాత ఏమైందో కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. దీంతో హీరోయిన్ ని ఫైనల్ చేయకుండానే గౌతమ్ తిన్ననూరి షూటింగ్ స్టార్ట్ చేసేసాడు. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ భొర్సేని ఖరారు చేసినట్లు గతంలో టాక్ వినిపించింది. యారియాన్ 2 మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ రవితేజ మిస్టర్ బచ్చన్ తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.
ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మని VD 12 కోసం ఫైనల్ చేశారనే ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ప్రేమలు ఫేమ్ మమిత బైజు పేరు వినిపిస్తోంది. వీరిద్దరూ సినిమాలో హీరోయిన్స్ గా ఉంటారా లేదంటే వీరిలో ఒకరిని ఖరారు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ఇద్దరు బ్యూటీస్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఎవరిని విజయ్ దేవరకొండకి జోడీగా ఫైనల్ చేసిన కచ్చితంగా ఫ్రెష్ ఫీల్ వస్తుందనే మాట వినిపిస్తోంది.
మమిత బైజు అయితే యూత్ ఆడియన్స్ కి ఇప్పటికే కనెక్ట్ అయిన నేపథ్యంలో విజయ్ దేవరకొండకి ఈ మల్లు బ్యూటీ జోడీగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన హీరోయిన్స్ పై అఫీషియల్ గా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉందంట.