Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : రీను శారీ లుక్.. మాటల్లేవ్ అంతే..!

సౌత్ లో ప్రెజంట్ ట్రెండింగ్ లో ఉన్న భామ మమితా బైజు. ప్రేమలు సినిమాతో ఆమె యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   11 May 2024 7:36 AM GMT
ఫోటో స్టోరీ : రీను శారీ లుక్.. మాటల్లేవ్ అంతే..!
X

సౌత్ లో ప్రెజంట్ ట్రెండింగ్ లో ఉన్న భామ మమితా బైజు. ప్రేమలు సినిమాతో ఆమె యూత్ కు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. గిరీష్ AD డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రేమలు సినిమా ఫస్ట్ మలయాళంలో రిలీజై సూపర్ హిట్ కాగా ఆ తర్వాత ఆ మూవీని తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేశారు. ప్రేమలు డబ్బింగ్ వెర్షన్ కూడా సూపర్ హిట్ అవ్వడంతో సౌత్ ఆడియన్స్ అంతా కూడా రీను అలియాస్ మమితా బైజు మాయలో పడిపోయారు.


దాదాపు ఏడేళ్లుగా మలయాళంలో సినిమాలు చేస్తూ వస్తున్న మమితాకు ప్రేమలు సినిమాతో బ్రేక్ వచ్చిందని చెప్పొచ్చు. అంతకుముందు అమ్మడు చేసిన సినిమాలతో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన అది కేవలం మలయాళ పరిశ్రమ వరకే ఉండేది. కానీ ప్రేమలు సినిమా మమితాను సౌత్ ఆడియన్స్ కు కొత్తగా పరిచయం చేసింది. సినిమా చూసిన తర్వాత ఎవరైనా ఆమె ప్రేమలో పడిపోయేలా చేసింది.


ప్రేమలు సినిమాకు యువతలో ఉన్న ఈ బజ్ ని దృష్టిలో ఉంచుకునే గిరీష్ AD ప్రేమలు 2 ని ప్లాన్ చేశారు. ప్రేమలు సూపర్ హిట్ అవ్వడమే ఆలస్యం వెంటనే కథ రాసి ప్రేమలు 2 ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇక సౌత్ లో తనకు వచ్చిన ఈ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న మమితా బైజు సినిమాలతోనే కాకుండా ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది. తన మార్క్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది అమ్మడు.


లేటెస్ట్ గా ప్రింటెడ్ రెడ్ కలర్ శారీ వైట్ బ్లౌజ్ తలలో మల్లెపూలు.. అచ్చ తెలుగు అమ్మాయిలా మమితాను అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉంది.. మమితా అదరగొట్టేసింది. రీను గా ప్రేక్షకులకు తనను తానుగా కొత్తగా పరిచయం చేసుకున్న మమితా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది. ప్రేమలు తర్వాత అమ్మడు చేసిన రెబల్ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ప్రేమలుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మమితాకు తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయట. అయితే తెలుగు లో చేయడమంటూ జరిగితే అది తనకు మరో ప్రేమలు అయ్యేలా ఉండాలని భావిస్తుంది మమితా. అందుకే ఇక్కడ నుంచి ఆఫర్లు వస్తున్నా చర్చల దశల్లోనే ఉన్నట్టు టాక్. రవితేజ, విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాల్లో మమితా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే వాటిల్లో మమితా ఏది ఓకే చేస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది.