Begin typing your search above and press return to search.

భలే ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ అమ్మడు...!

గత కొన్ని వారాలుగా సౌత్‌ ఇండియాతో పాటు నార్త్‌ ఇండియాలో కూడా మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ప్రేమలు గురించిన చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   24 March 2024 5:30 AM GMT
భలే ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ అమ్మడు...!
X

గత కొన్ని వారాలుగా సౌత్‌ ఇండియాతో పాటు నార్త్‌ ఇండియాలో కూడా మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ప్రేమలు గురించిన చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ప్రేమలు సినిమాను తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి తనయుడు కార్తికేయ డబ్‌ చేసి విడుదల చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

పాన్ ఇండియా రేంజ్ లో ప్రేమలు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హీరోయిన్‌ గా నటించిన మమిత బైజు కి స్టార్‌ ఇమేజ్ దక్కింది. ప్రేమలు సినిమా విడుదల అయిన కొన్ని వారాల్లోనే మరో సినిమా 'రెబల్‌' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

జీవీ ప్రకాష్ హీరోగా మమిత బైజు హీరోయిన్ గా రూపొందిన రెబల్‌ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచింది. 1980 బ్యాక్ డ్రాప్‌ లో రూపొందిన ఈ సినిమా కాన్సెప్ట్‌ బాగున్నా కూడా దర్శకుడు నికేష్‌ స్క్రీన్‌ ప్లే తో మెప్పించడం లో విఫలం అయ్యాడు అంటూ రివ్యూలు వచ్చాయి.

రెబల్‌ సినిమా హిట్ అయ్యి ఉంటే కచ్చితంగా మమిత బైజు కచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌ లో మరింత బిజీ అయ్యేది. ఇటీవల మమిత బైజు తెలుగు సినిమా కు ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. కానీ రెబల్‌ సినిమా నిరాశ పరిచిన నేపథ్యంలో ఆమెకు తెలుగు ఛాన్స్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ మలయాళ బ్యూటీ కి అందంతో పాటు నటనలో మంచి ప్రతిభ ఉంది అని ప్రేమలు సినిమాతో నిరూపితం అయ్యింది. కానీ రెబల్‌ సినిమా ను ఆమె ఎంపిక చేసుకోవడం తప్పుడు నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెబల్‌ ఫ్లాప్‌ అవ్వడంతో మమిత భలే ఛాన్స్ మిస్ చేసుకుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.