మెగాస్టార్ స్థాయికి తగ్గ మూవీ కాదు..!
ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో సక్సెస్ రేటు చాలా తక్కువ
By: Tupaki Desk | 24 May 2024 6:11 AM GMTఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాల్లో సక్సెస్ రేటు చాలా తక్కువ. అయితే మలయాళ సినిమాల్లో మాత్రం చాలా వరకు మంచి విజయాలను సాధించాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అర డజను వరకు వంద కోట్లు, అంతకు మించిన వసూళ్లు నమోదు చేసిన సినిమాలు ఉన్నాయి.
ముఖ్యంగా బ్రహ్మయుగం, ప్రేమలు, ది గోట్ లైఫ్, మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం సినిమాలు మలయాళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని భాషలకు చెందిన సినీ ప్రేక్షకులను మెప్పించిన విషయం తెల్సిందే. మలయాళ సినిమా ఇండస్ట్రీ లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లకి మెగాస్టార్ మమ్ముటీ సినిమా ఫ్లాప్ తో బ్రేక పడింది.
బ్రహ్మయుగం సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న మమ్ముట్టీ తాజాగా టర్బో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగాస్టార్ సినిమా మాదిరిగా కాకుండా ఒక చిన్నా చితకా సినిమా మాదిరిగా టర్బో ఉందని రివ్యూలు వచ్చాయి.
వైశాఖ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మిథున్ మాన్యూవల్ థామస్ కథను అందించారు. ఈ విభిన్నమైన యాక్షన్ కామెడీ సినిమా ను ప్రేక్షకులు తిరస్కరించారు. ఇలాంటి సినిమాను మమ్ముట్టీ నుంచి ఆశించలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
రాజ్ బి శెట్టి ని విలన్ గా చూపించిన ప్రయత్నం విఫలం అయ్యింది. ఆయన పాత్ర మరీ వీక్ గా ఉండటంతో పాటు మమ్ముట్టీ ని ఢీ కొట్టే మాదిరిగా లేదు. 80, 90 ల్లో వచ్చిన కమర్షియల్ యాక్షన్ సినిమాల మాదిరిగా ఈ సినిమా ఉందని, ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా ఎక్కదని ముందే రివ్యూవర్స్ పేర్కొన్నారు.
వంద కోట్ల వసూళ్లు ఖాయం అనుకున్న టర్బో మేకర్స్ వస్తున్న వసూళ్లు చూసి షాక్ అవుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల నుంచి వస్తున్న సినిమాల్లో ఇలాంటి ఫలితం మరే సినిమాకు కూడా దక్కలేదు అనేది మలయాళ సినీ విశ్లేషకుల అభిప్రాయం.