Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ మూవీలో నటించి తప్పు చేశా...!

అలాంటిది మమతా మోహన్ దాస్ మాత్రం రజినీ సినిమాలో నటించినందుకు విచారం వ్యక్తం చేస్తుంది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 1:30 AM GMT
సూపర్‌ స్టార్‌ మూవీలో నటించి తప్పు చేశా...!
X

సాధారణంగా స్టార్‌ హీరోల సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించే అవకాశం వచ్చినా చాలు అన్నట్లుగా చాలా మంది హీరోయిన్స్ ఉంటారు. ఇక మరి కొందరు హీరోయిన్స్ స్టార్‌ హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా సిద్ధం అన్నట్టుగా ఉంటారు. అలాంటిది మమతా మోహన్ దాస్ మాత్రం రజినీ సినిమాలో నటించినందుకు విచారం వ్యక్తం చేస్తుంది.

తాజాగా విజయ్‌ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మమతా మోహన్‌ దాస్‌ మళ్లీ బిజీ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గత కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు వెళ్లడించింది. కొన్ని సినిమాలను తాను చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని నేను అనుకుంటాను. అందులో ఒకటి ఖచ్చితంగా రజినీకాంత్‌ సినిమా 'కుసేలన్‌'(కథానాయకుడు).

కుసేలన్‌ లో ఒక ప్రత్యేక పాట కోసం మమతా మోహన్‌ దాస్‌ ను తీసుకున్నారు. రెండు రోజుల పాటు ఆమె పై షూటింగ్ చేశారట. చివరకు ఎడిటింగ్ లో ఆమె పార్ట్‌ మొత్తం లేపేసి చివరకు కొన్ని సెకన్లు మాత్రమే చూపించారట. ఆ విషయం తనకు చాలా బాధ ను కలిగించిందని మమతా చెప్పుకొచ్చింది.

రజినీకాంత్ తో సినిమా అంటే కొన్ని నిమిషాలు కనిపించినా ఆ హీరోయిన్‌ చాలా లక్కీ గా భావించవచ్చు. అలాంటిది కనీసం నిమిషం కూడా ఆన్‌ స్క్రీన్‌ లేకుంటే ఆ సినిమాలో నటించి ఎందుకు అంటూ చాలామంది అప్పుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు మమతా మోహన్‌ దాస్ ఆ సినిమాలో నటించి తప్పు చేశానంది.