మంగళవారం బాక్సాఫీస్.. టార్గెట్ ఎంతంటే?
అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీద్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం మంగళవారం.
By: Tupaki Desk | 17 Nov 2023 5:09 AM GMTఅజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ లీద్ రోల్ లో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వస్తోన్న చిత్రం మంగళవారం. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ తోనే ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఏదో డిఫరెంట్ స్టొరీని అజయ్ భూపతి మంగళవారం సినిమాతో చెబుతున్నాడనే ఫీల్ కలిగింది. అలాగే కాంతారా ఫేం అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండటంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.
ఎలాంటి అంచనాలు లేకుండా స్టార్ క్యాస్టింగ్ లేకుండా భారీ బడ్జెట్ తో అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహాసముద్రం లాంటి డిజాస్టర్ తర్వాత చేస్తోన్న మూవీ కావడంతో పెద్దగా ఎవరి దృష్టి పడలేదు. అంచనాలు లేకుండా షూటింగ్ చేసుకోవడం కూడా అజయ్ భూపతికి మంగళవారంతో ఒక మ్యాజిక్ చేసే అవకాశం దొరికింది. దీంతో ట్రైలర్ లోనే క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
ఒక్కసారిగా ఈ సినిమా బిజినెస్ లెక్కలు అన్ని మారిపోయాయి. నైజాంలో 3.20 కోట్లకి రైట్స్ అమ్ముడైపోయాయి. ఆంధ్రా, సీడెడ్ కలిపి 7 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ లో 2 కోట్ల వరకు మార్కెట్ అయ్యింది. మొత్తం 13.20 కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం సినిమా థీయాట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో పాటు నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారా భారీగానే ఆదాయం వచ్చింది.
రిలీజ్ కి ముందే నిర్మాతలకి మంగళవారం మూవీతో అజయ్ భూపతి టేబుల్ ప్రాఫిట్ తెప్పించాడు. ఈ రోజు మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. సినిమా మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కి తోడు చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు పోటీలో లేకపోవడంతో సాలిడ్ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఏ మాత్రం మౌత్ టాక్ పాజిటివ్ గా ఉన్న వీకెండ్ అయ్యేసరికి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వచ్చేస్తాయి.
13 కోట్ల బ్రేక్ ఈవెన్ తో మంగళవారం థియేటర్స్ లోకి వస్తోంది. ఇది పెద్ద టార్గెట్ అయితే కాదు. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే శని, ఆదివారాలు థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్ లు పడిపోవడం ఖాయం అనే మాట వినిపిస్తోంది. మరి అజయ్ భూపతికి మంగళవారం ఎలాంటి సక్సెస్ ఇస్తుందనేది వేచి చూడాలి.