Begin typing your search above and press return to search.

మంగళవారం బడ్జెట్.. ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా?

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఇతను రెండో సినిమాగా మహాసముద్రం చేశారు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:30 AM GMT
మంగళవారం బడ్జెట్.. ఆ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయా?
X

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి. ఇతను రెండో సినిమాగా మహాసముద్రం చేశారు. మల్టీ స్టారర్ గా వచ్చిన ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. అయతే మూడో ప్రయత్నంగా మంగళవారం మూవీతో పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. భారీ అంచనాల మధ్య మూవీ నవంబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది.


ఇప్పటికే ఈ సినిమా థీయాట్రికల్ రైట్స్ అన్ని ప్రాంతాలలో అమ్ముడైపోయాయి. నాన్ థీయాట్రికల్ రైట్స్ కూడా సొల్ద్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండానే కేవలం కంటెంట్ ని నమ్ముకొని 20 కోట్ల వరకు మంగళవారం మూవీపై పెట్టుబడి పెట్టినట్లు తాజాగా ఇంటర్వ్యూలో అజయ్ భూపతి చెప్పుకొచ్చారు. అలాగే మహాసముద్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన వెంటనే మంగళవారం సినిమా చేసేవాడిని అని తెలిపారు.

మంగళవారం టైటిల్ ఏదో ఆషామాషీగా పెట్టలేదని, చాలా అధ్యయనం చేసిన తర్వాత తన కథకి కూడా ఈ పేరు అయితే యాప్ట్ అవుతుందని అనుకోని పెట్టింది మాత్రమే అని చెప్పారు. తనకి డార్క్ థ్రిల్లర్ సినిమాలు అంటే చాలా ఇష్టం అని, అలాంటి ఓ కథ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని అజయ్ భూపతి క్లారిటీ ఇచ్చారు. అందులో భాగంగానే మంగళవారం మూవీ ఇప్పుడు వస్తోందని అన్నారు.

ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని, భయపడతారు, ఏడుస్తారు, థ్రిల్ ఫీల్ అవుతారు. తన సినిమాలలో ఎక్కడో మూడు, నాలుగు నిమిషాలు హీరోయిన్ ని కాస్తా బోల్డ్ గా చూపిస్తానని, కథ డిమాండ్ మేరకే ఆ సీన్స్ ఉంటాయి తప్ప బలవంతంగా పెట్టేవి మాత్రం కాదని చెప్పారు. ఆర్ఎక్స్ 100 సినిమాలో కూడా కేవలం ఒక్క పాటలో మాత్రమే పాయల్ రాజ్ పుత్ ని కాస్తా బోల్డ్ గా చూపించానని అన్నారు.

మంగళవారం సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఒక యునిక్ పాయింట్ ఉంటుందని, ఆ ఎలిమెంట్స్ ప్రేక్షకులు అందరికి కనెక్ట్ అవుతాయని అజయ్ భూపతి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ కథ విన్నవారందరూ బాగుందని చెప్పారు. ప్రేక్షకులని మెప్పించడం కోసమే మనం ఏం చేసిన కూడా. కచ్చితంగా మంగళవారంలో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయని ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. ఇక ఈ సినిమా పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువగా 20 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయో లేదో చూడాలి.