Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. మరో ట్రోల్స్ గోల

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని బన్నీ పెంచుకున్నాడు.

By:  Tupaki Desk   |   12 Nov 2023 6:52 AM GMT
అల్లు అర్జున్.. మరో ట్రోల్స్ గోల
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ని బన్నీ పెంచుకున్నాడు. అతని స్టైల్, ఆటిట్యూడ్ కి నార్త్ ఇండియన్స్ కూడా ఫాలోవర్స్ గా మారిపోయారు. అల వైకుంఠపురంలో సినిమాతోనే బన్నీ క్రేజ్ ఇండియన్ వైడ్ గా ఎస్టాబ్లిష్ అయిపొయింది. అలాగే స్టైలిష్ కి కేరాఫ్ గా మారిపోయిన బన్నీకి అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న సౌత్ హీరోలలో బన్నీ టాప్ లో ఉంటాడని చెప్పొచ్చు. పుష్పతో నేషనల్ అవార్డు అందుకొన్న బన్నీ ఫస్ట్ తెలుగు నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోగా మారిపోయాడు. పుష్ప 2 సినిమాకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ బట్టి అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయికి పెరిగిందో చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మధ్య మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో బన్నీ విగ్రహం పెట్టడానికి కొలతలు తీసుకున్నారు.

ఇంత వరకు భాగానే ఉంది. తాజాగా మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ కి బన్నీ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఇందులో మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో స్టాట్యూగా కనిపించబోతున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ హీరో అల్లు అర్జున్ అంటూ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. దీనిని ఇప్పుడు సోషల్ మీడియాలో బన్నీ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే టుస్సాడ్ మ్యూజియం లో డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాలు ఉన్నాయి.

వారి సినిమాలకి సంబందించిన లుక్స్ తో మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అందరికంటే ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు విగ్రహం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టారు. తరువాత బాహుబలి సినిమాతో ప్రభాస్ విగ్రహం కూడా మ్యూజియంకి వచ్చింది. ఈ మ్యూజియంలో పెట్టబోతున్న మూడో తెలుగు హీరో అల్లు అర్జున్. ఆ విషయాన్ని నిర్వాహకులు తెలుసుకోకుండా బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ సౌత్ హీరో అని ప్రెజెంట్ చేశారు.

దీనిని డార్లింగ్ ప్రభాస్ అభిమానులు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో కూడా అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో పలు సందర్భాలలో ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు మేడమ్ టుస్సాడ్ లో మైనపు విగ్రహం విషయంలో మరోసారి ట్రోలర్స్ బారిన పడినట్లు అయ్యింది.