Begin typing your search above and press return to search.

మనమే.. సక్సెస్ సర్ ప్రైజ్

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మనమే

By:  Tupaki Desk   |   16 Jun 2024 7:19 AM GMT
మనమే.. సక్సెస్ సర్ ప్రైజ్
X

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా మనమే. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. కంప్లీట్ ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ మూవీ కథ ఉంటుంది. హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆదిత్య సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.

ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యిందని తెలుస్తోంది. అలాగే శర్వానంద్, కృతి శెట్టి మధ్యలో టాప్ అండ్ జెర్రీ ఫైట్, లవ్ స్టోరీ కూడా యూత్ ని నచ్చిందని టాక్. ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ మూవీ నుంచి సక్సెస్ సెలబ్రేషన్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో వినోదంతో పాటు కాస్తా లవ్ అండ్ ఎమోషన్ ని కూడా జోడించారు. ప్రేక్షకులకి ఫీల్ గుడ్ అనుభూతిని కలిగించే విధంగా ట్రైలర్ ఉంది.

జూన్ 7న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. శర్వానంద్ కి ఒకే ఒక జీవితం తర్వాత మనమేతో మరో సక్సెస్ ఖాతాలో పడినట్లు అయ్యింది. శ్రీరామ్ ఆదిత్య కూడా హీరో మూవీతో ఫ్లాప్ అందుకొని చాలా గ్యాప్ తీసుకొని మనమే చేశారు. ఆయన కష్టానికి ఫలితం వచ్చినట్లే అని ఈ మూవీ చూసిన వారి నుంచి వస్తోన్న టాక్. గత కొంతకాలంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే మూవీ ఒకటి కూడా పడలేదు.

అయితే మనమే సినిమాతో ఆ లోటు తీరిపోయింది. అలాగే శర్వానంద్ కి ఇలాంటి క్లాస్ టచ్ ఉన్న కథలతోనే సక్సెస్ లు వస్తాయని మరోసారి ప్రూవ్ అయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ హేసమ్ అబ్దుల్ వాహబ్ కి మనమే సినిమాతో మరో మ్యూజికల్ హిట్ వచ్చింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మనమే సినిమాతో సోలోగా మంచి హిట్ లభించింది.

మూవీ కలెక్షన్స్ ఏ స్థాయిలో అందుకుంటుంది అనే దానిని బట్టి సినిమా సక్సెస్ రేంజ్ తెలుస్తుంది. మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఇప్పటికే చేసుకున్నారు. మనమే సక్సెస్ తో శర్వానంద్ నెక్స్ట్ సినిమాపై ఇప్పుడు ఆసక్తి పెరిగింది. రెండు, మూడు ప్రాజెక్ట్స్ అతని లైన్ అప్ లో ఉన్నట్లు తెలుస్తోంది.