Begin typing your search above and press return to search.

శర్వా 'మనమే'.. ఓ మోసం!

ఆయన వివరించిన ప్రకారం, "మనమే" సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను మూడో పార్టీకి ముందే అమ్మేశామని అన్నారు. కానీ వారు మోసం చేయడం వల్ల 70 నుంచి 80 శాతం వరకు పెట్టుబడి కోల్పోయినట్లు వెల్లడించారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 10:15 AM GMT
శర్వా మనమే.. ఓ మోసం!
X

శర్వానంద్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన "మనమే" సినిమా థియేట్రికల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే సినిమా విడుదలై రెండు నెలలు దాటినా కూడా ఇంకా ఓటిటిలో విడుదల కాకపోవడంతో కారణం ఏమిటనేది అంతు పట్టడం లేదు. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్ వంటి అంశాలు, సినిమాని ఓటిటి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాయి.

అయితే రోజులు గడుస్తున్నా, సినిమా ఓటిటిలో విడుదల కాకపోవడం, అభిమానులను నిరుత్సాహపరచింది. ఇక ఇటీవల నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. ఆయన వివరించిన ప్రకారం, "మనమే" సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను మూడో పార్టీకి ముందే అమ్మేశామని అన్నారు. కానీ వారు మోసం చేయడం వల్ల 70 నుంచి 80 శాతం వరకు పెట్టుబడి కోల్పోయినట్లు వెల్లడించారు.

ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున, త్వరలోనే న్యాయం జరిగే అవకాశముందని ఆయన అన్నారు. డీల్ కు సంబంధించిన కేసు పరిష్కారమయ్యాక, మోసగాళ్ల వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఈ వివాదం బయటపడటం ఇండస్ట్రీలో ఓటిటి బిజినెస్ పై కొత్త చర్చలకు దారితీస్తోంది. కొన్ని సంస్థలు తక్కువ రేటుకు నిర్మాతల వద్ద హక్కులు కొనుగోలు చేసి, వాటిని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు అధిక రేటుకు అమ్మడం లేదా పే పర్ వ్యూ ద్వారా అధిక లాభాలు పొందడం వంటి విషయాలు బయటకు వస్తున్నాయి.

ఈ పరిస్థితిని చర్చించేందుకు విశ్వప్రసాద్ ముందుకొచ్చినందుకు మరికొంతమంది నిర్మాతలు కూడా గళం విప్పే అవకాశం ఉంది. ఇక "మనమే" సినిమా థియేటర్లలో విజయం సాధించకపోయినా, అది ఓటిటిలో తప్పక చూడదగ్గ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. సినిమా విడుదల అయినప్పుడు కూడా మరీ ఎక్కువ స్థాయిలో నెగిటివ్ టాక్ ఏమి రాలేదు. రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి. కానీ సినిమాను ఓటీటీ లో చూడవచ్చని ఓ వర్గం నుంచి కామెంట్స్ వచ్చాయి.

ఇక ఈ సినిమాకు యువ డైరెక్టర్ విక్రమ్ ఆదిత్య దర్శకత్వం వహించగా హీరోయిన్ గా కృతి శెట్టి నటించారు. సినిమాకు హెశమ్ అబ్దుల్ ఇచ్చిన మ్యూజిక్ బాగా క్లిక్కయ్యింది. ఇక సినిమాలో కామెడీ లవ్ ఎమోషన్స్ బాగానే హైలెట్ అయ్యాయి. ముఖ్యంగా శర్వానంద్ కామేడి సీన్స్ బాగున్నాయనే కామెంట్స్ వచ్చాయి. మరి సినిమా ఓటీటీ లో విడుదల అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.