Begin typing your search above and press return to search.

ఈ మూవీలో ఏకంగా 16 పాటలంట

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు

By:  Tupaki Desk   |   2 Jun 2024 4:11 AM GMT
ఈ మూవీలో ఏకంగా 16 పాటలంట
X

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. జూన్ 7న ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. కృతి శెట్టి శర్వానంద్ కి జోడీగా ఈ మూవీలో నటించింది. కంప్లీట్ ఫారిన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా కథ మొత్తం ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా మూవీ ట్రైలర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ మనమే ట్రైలర్ లో లవ్, కామెడీ, సెంటిమెంట్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్ని పుష్కలంగా ఉండేలా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆవిష్కరించారు. ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శర్వానంద్ రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే కృతి శెట్టికి కూడా ఈ మూవీ చాలా కీలకం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రివీల్ చేశారు.

మనమే మూవీలో మొత్తం 16 పాటలు ఉంటాయని తెలిపాడు. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో కూడా ఇన్ని పాటలు పెట్టలేదు. మొదటి సారి ఇందులో 16 సాంగ్స్ ని పెట్టడం సంచలనంగా మారింది. ఈ మధ్యకాలంలో సినిమాలలో 3-4 పాటలు ఉండటం కూడా గగనం అయిపోతుంది. హిందీలో వచ్చిన హమ్ ఆప్కే హై కౌన్‌ సినిమాలో 14 పాటలు ఉన్నాయి. ఇవన్నీ సూపర్ హిట్స్. ఆ తరువాత ఎవరూ కూడా ఎక్కువ పాటలు పెట్టే సాహసం చేయలేదు.

ఈ సినిమాకి హమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఖుషి, హాయ్ నాన్న సినిమాలకి హేషమ్ అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. ఈ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అతని నుంచి ఎక్కువగా మెలోడీ బీట్స్ వినిపిస్తాయి. మనమే మూవీతో ఈ సంగీత దర్శకుడు ఏదో వండర్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాడు. మెయిన్ సాంగ్స్ తో పాటుగా థీమ్ సాంగ్స్ ఈ చిత్రంలో ఎక్కువ ఉంటాయంట.

బ్యాగ్రౌండ్ స్కోర్ ని ఎక్కువగా పాటల ద్వారానే ప్రెజెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీరామ్ ఆదిత్య నుంచి చివరిగా హీరో మూవీ వచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అయితే మనమే చిత్రంతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాననే నమ్మకంతో దర్శకుడు ఉన్నాడు. మూవీపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా పేర్కొన్నాడు. శర్వానంద్, కృతి శెట్టి, శ్రీరామ్ ఆదిత్య ముగ్గురుకి కూడా ఈ సినిమా చాలా కీలకం కానున్న నేపథ్యంలో ఎలాంటి విజయాన్ని అందుకుంటారనేది చూడాలి.