`పిఠాపురం`లో హోరెత్తించాలనుకున్నాం..కానీ మిస్!
`పిఠాపురం` లో పవన్ గెలుపు తో ఇప్పుడా పేరు నెట్టింట మారుమ్రోగుతుంది. ఇంతవరకూ పిఠాపురం అంటే? ఏపీ ప్రజలకే తెలుసు.
By: Tupaki Desk | 6 Jun 2024 6:28 AM GMT`పిఠాపురం` లో పవన్ గెలుపు తో ఇప్పుడా పేరు నెట్టింట మారుమ్రోగుతుంది. ఇంతవరకూ పిఠాపురం అంటే? ఏపీ ప్రజలకే తెలుసు. కానీ పీకే గెలుపుతో పిఠాపురం ఇండియా అంతటా ఫేమస్ అవుతుంది. సినిమాల్లో పవర్ స్టార్ గా ఎదిగిన వైనంతోనే ఇప్పుడు పిఠాపురం పేరు దేశ వ్యాప్తంగా జనాల్లోకి వెళ్తుంది. పిఠాపురం వైపు ఇప్పుడంతా చూస్తున్నారు. అయితే ఇక్కడ పీకే గెలుపుకి వర్మ టీడీపీ వర్మ కీలక పాత్రదారి అన్నది ప్రేక్షకులంతా గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగానూ అంతా భావిస్తున్నారు.
ఆ సంగతి పక్కన బెడితే తాజాగా నిన్నటి రోజున శర్వానంద్ హీరోగా నటిస్తోన్న `మనమే` సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించి సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకను తొలుత పిఠాపురం లో నిర్వహించాలనుకున్నట్లు శర్వానంద్ తెలిపాడు. అక్కడ అనుమతులు దొరకకపోవడంతో హైదరాబాద్ లేనే చేయాల్సి వచ్చిందన్నారు. అయితే సక్సెస్ పార్టీ మాత్రం పిఠాపురంలోనే ఉండొచ్చు అని అన్నారు.
అలా పిఠాపురంలో జరగాల్సిన మనమే వేడుక మిస్ అయింది. అనుమతులు వచ్చి ఉంటే గనుక గెలుపు ఉత్సాహంలో భారీ ఎత్తున ఈవెంట్ ని నిర్వహించేవారు.ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతోనే సాధ్యం కాలేదు. అయినా ఈ సినిమాతో అయిపోలేదు. పిఠాపురంలో ఇకపై నిర్వహించాల్సిన వేడుకలు చాలానే ఉంటాయి. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా మంది ఉన్నారు. యూత్ స్టార్ నితిన్ పెద్ద వీరాభిమాని.
ఇంకా ఇలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్లంతా కూడా పిఠాపురంలో తమ సినిమా ఈవెంట్లు నిర్వహించడానికి ఆస్కారం లేకపోలేదు. దేశమే పిఠాపురం గురించి మాట్లాడుకునేలా చేస్తామని ప్రచార సమయంలో వాగ్దానాలు చేసారు. వాటిని సైతం రుజువు చేయాల్సిన బాధ్యత కూడా అంతే ఉంది. సినిమా ఈవెంట్లతో పాటు, పిఠాపురాన్ని అభివృద్ది పధంలోనూ నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.