చిత్తూరు బ్యూటీ సత్తా చాటేనా?
అందులో హీరోయిన్ గా మానస చౌదరి నటిస్తోంది. అమ్మడికిదే తొలి సినిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మడు తన నేపథ్యం గురించి చెప్పుకొచ్చింది.
By: Tupaki Desk | 27 Dec 2023 6:14 AM GMTతెలుగమ్మాయిలకు ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే దక్కుతున్నట్లు కనిపిస్తోంది. ఒకప్పటి సన్నివేశంతో పోల్చితే కొత్త భామలకి అవకాశాలివ్వడానికి దర్శక-నిర్మాతలు ముందుకొస్తున్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ముందుగానే ప్రతిభను నిరూపించుకునే షార్ట్ ఫిలిం లాంటివి నవతరం భామలకి కలిసొస్తుంది. వాటిని చూసి సినిమాకి పనికొస్తారని అవకాశాలు కల్పిస్తున్నారు. వైష్ణవి చైతన్య అలాగే వెలుగులోకి వచ్చి 'బేబి' సినిమాతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.
తాజాగా 'బబుల్ గమ్' హీరోయిన్ కూడా తెలుగమ్మాయి అనే తెలుస్తోంది. ఫేమస్ యాంకర్ సుమ-రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రమిది. అందులో హీరోయిన్ గా మానస చౌదరి నటిస్తోంది. అమ్మడికిదే తొలి సినిమా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అమ్మడు తన నేపథ్యం గురించి చెప్పుకొచ్చింది. 'మాది చిత్తూరు జిల్లా పుత్తూరు లో పుట్టా. కానీ పెరిగింది చెన్నైలో. నాకెలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. చదువు పూర్తికాగానే మోడలింగ్ లోకి దిగేసా. ఆ అనుభవంతోనే తమిళ్ లో 'ఎమోజీ' అనే వెబ్ సిరీస్ లో నటించా.
అక్కడ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాను. కానీ రాలేదు. దీంతో ఓ స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్ కి నా ప్రోపైల్ పంపిచాను. ఆయనకి నేను నచ్చడంతో సినిమాకి ఎంపిక చేసారు. పోటోషూట్ చేసిన తర్వాత నన్ను తీసుకున్నారు. మోడలింగ్ అనుభవంతో కెమెరా ఫియర్ ఎక్కడా కలగలేదు. తొలి సినిమా అయినా ఎక్కడా బెరుకు లేకుండానే నటించాను. అందుకు మోడలింగ్ ఎంతో సహకరించిందని చెప్పాలి.
ఆ అనుభవం లేకపోతే కెమెరా అంటే భయమేసేదేమో. జాన్వీ అనే పాత్రలో కనిపిస్తా. సినిమాలో కొన్ని గాఢమైన సన్నివేశాలుంటాయి. అవి భావోద్వేగాల్ని పండించడం కోసమే అలా నటించాల్సి వచ్చింది. అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు సవాల్ గా అనిపించింది. నిజానికి ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయ. వచ్చినప్పుడు ఆ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. నటిగా ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టాను. నటన విషయంలో ఎలాంటి పరిమితులు లేవు స్పై నేపథ్యమున్న సినిమాలు చేయాలని ఉంది' అని అంది.