మంచు మనోజ్ ఒంటిపై గాయాలు...దెబ్బలు ఎలా తగిలాయ్ ?
By: Tupaki Desk | 8 Dec 2024 8:07 PM GMTటాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్నాయని హైదరాబాద్ లోని టీఎక్స్ ఆసుపత్రి వర్గాలు తేల్చాయి. మంచు మనోజ్ తన తండ్రి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుతో గొడవ పడ్డారని అది ఫిజికల్ దాకా వెళ్ళిందని ఆదివారం రోజంతా జరిగిన ప్రచారంలో నిజానిజాలు అయితే తెలియవు అంటున్నారు
కానీ ఆదివారం సాయంత్రం ఆసుపత్రికి తన భార్యతో సహా వచ్చిన మనోజ్ కొన్ని పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కుడి కాలు కండరం నొప్పితోనే వచ్చారని అంటున్నారు. అయితే మనోజ్ కి సిటీ స్కాన్, ఎక్స్ రే వంటివి తీశారు. మెడ భాగంలో కండరాల మీద స్వల్పంగా గాయాలు అయినట్లుగా వైద్యులు తేల్చారని అంటున్నారు.
సుదీర్ఘంగా రెండు గంటల పాటు మనోజ్ కి వైద్య పరీక్షలు సాగాయని అంటున్నారు. అయితే సిటీ స్కాన్, ఎక్స్ రే నివేదికలలో మాత్రం నార్మల్ అని తేలింది. ఇక నడవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మనోజ్ ఆసుపత్రికి వచ్చారు. అవి మీడియాలో విజువల్స్ రూపంలో కూడా కనిపించాయి.
మరో వైపు మంచు మనోజ్ ఇరవై నాలుగు గంటల పాటు తమ అబ్జర్వేషన్ లో ఉండాలని వైద్యులు కోరారని ఆయన మాత్రం డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయారని అంటున్నారు. అవసరం అయితే మరోసారి వస్తానని ఆయన చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే మంచు మనోజ్ వంటిపై ఉన్న గాయాలను బట్టి ఆయనను ఎవరో కొట్టారని అర్ధం అవుతోంది అంటున్నారు. మరి ఎవరు ఆయనను కొట్టారు, ఎందుకు కొట్టారు అన్నది అయితే తెలియాల్సి ఉంది. అయితే తన కుటుంబ సభ్యులతో వివాదం వల్లనే ఫిజికల్ ఎటాక్ దాకా అది దారి తీసిందని మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేసినట్లుగా ప్రచారం సాగింది. అయితే పోలీసులు దానిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
మరో వైపు చూస్తే కనుక మంచు కుటుంబంలో గొడవలతో కొట్టుకున్నారు అన్న దాని మీద మీడియాలో వచ్చినవి అన్నీ ఊహాజనిత కధనాలే అని అవన్నీ నిరాధారమైన పుకార్లు అని మంచు హీరోల పీఆర్ టీం అయితే స్పష్టం చేసింది. వాటి సంగతి అలా ఉంటే గాయాల పాలు అయినది మాత్రం మనోజ్ అన్నది కంటికి కనిపిస్తున్న విషయం.
మరి ఆయనను ఎవరు కొట్టారు అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయంలో మనోజ్ ఏమి చెబుతారు అన్నది మీడియా ఆసక్తిగా ఉంది. అయితే ఆసుపత్రికి వచ్చినపుడు మీడియా ఎంత ప్రశ్నించినా మనోజ్ అయితే పెదవి విప్పలేదు. ఆయన కాలికి తగిలిన గాయం బాధతో మెల్లిగా నడచుకుంటూ ఆసుపత్రి లోపలికి వెళ్లారు. మరి తరువాత అయినా మనోజ్ రియాక్ట్ అవుతేనే ఏ విషయం అయినా తెలిసేది అని అంటున్నారు.
లేకపోతే మాత్రం ఇది మనోజ్ కి తగిన గాయాలు అన్న వరకే పరిమితం అవుతుంది. ఏది ఏమైనా మీడియా సండే రోజంతా అటెన్షన్ పే చేసిన ఒక సంచలన వార్తగానే దీనిని అంతా చూసారు. అలాగే మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.