జెనరేటర్‌లో అందుకే షుగర్ వేశా: మంచు విష్ణు
ఈ అంశంపై మంచు విష్ణు రీసెంట్ గా ఎక్స్‌లో స్పందించాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 1 March 2025 11:25 AM GMTగత కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. మనోజ్- మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం, ఇలా రోజుకో ట్విస్టుతో గొడవ ముదిరిపోతుంది. దీంతో ఈ ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలు అందరికీ ఆసక్తికరంగా మారాయి. ఈ గొడవల్లో మంచు ఫ్యామిలీ మొత్తం ఒక వైపు ఉంటే, మంచు మనోజ్ మాత్రం ఒంటరిగా ఉన్నాడు.
రీసెంట్ గా తిరుపతిలో మోహన్‌బాబు యూనివర్సిటీ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ గొడవలన్నింటిలో హైలైట్ గా నిలిచిన అంశం తమ్ముడు ఉంటున్న నాన్న ఇంటికి వెళ్లి మంచు విష్ణు జెనరేటర్ లో పంచదార పోయడమే. ఈ విషయాన్ని స్వయంగా మనోజే ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాడు.
ఈ అంశంపై మంచు విష్ణు రీసెంట్ గా ఎక్స్‌లో స్పందించాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీ వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు తాజాగా ఎక్స్‌లో ఆస్క్ విష్ణు పేరిట చాట్ సెషన్ నిర్వహించగా అందులో ఓ నెటిజన్ మేం నిన్ను ఏమన్నా నువ్వు మాకు రిప్లై ఇస్తున్న మంచి మనసు నీది. మరి ఆ రోజు జనరేటర్ లో షుగర్ ఎందుకు వేశావ్ అన్నా అని ప్రశ్నించగా దానికి విష్ణు రిప్లై ఇచ్చాడు.
నెటిజన్ ప్రశ్నకు సమాధానంగా విష్ణు ఫ్యూయెల్ లో షుగర్ కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా అని సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చాడు. అయితే విష్ణు ఇప్పుడు ఈ విషయంలో ఏం మాట్లాడిన పెద్ద రచ్చ అవుతుందని ముందే గ్రహించి అందుకే సెటైరికల్ గా ఆన్సర్ ఇచ్చి ఆ టాపిక్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు.
ఇదిలా ఉంటే ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న కన్నప్ప సినిమాను మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, ఇందులో ఎంతో మంది ప్రముఖ నటులు కీలకపాత్రలు చేస్తున్నారు. మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని విష్ణు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.