Begin typing your search above and press return to search.

మంచు కుటుంబంలో మళ్లీ మంటలు... విష్ణుపై మనోజ్ ఫిర్యాదు!

ఇందులో భాగంగా... తాజాగా విష్ణుపై మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 2:04 PM GMT
మంచు కుటుంబంలో మళ్లీ మంటలు... విష్ణుపై మనోజ్ ఫిర్యాదు!
X

గత కొన్ని రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో మొదలైన మంటలు తీవ్రస్థాయికి వెళ్లిన అనంతరం పోలీసుల ఎంట్రీతో కాస్త చల్లబడినట్లు కనిపించాయనే చర్చ జరుగుతున్న వేళ.. మరోసారి ఆ మంటలు రాజుకున్నట్లు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... తాజాగా విష్ణుపై మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అవును... మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ మొదలైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో... వినయ్ అనే వ్యక్తిపై కూడా మనోజ్ ఫిర్యాదు చేశాడు. సుమారు ఏడు అంశాలతో ఏడు పేజీలతో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.

ఈ సందర్భంగా... విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం! ఇప్పటికే.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని మనోజ్.. మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదులు చేయగా.. తాజాగా విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందని మనోజ్ ఫిర్యాదు చేయడం వైరల్ గా మారింది.

మరోపక్క.. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి కేసులో నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో.. ఏ క్షణమైనా మోహన్ బాబు అరెస్ట్ ఉండోచ్చనే చర్చ మొదలైందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా విష్ణు నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.