ప్రగ్య - రకుల్ ఫ్యామిలీస్‌తో మంచు లక్ష్మి దీపావళి
హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్టయ్యాక మంచు లక్ష్మీ ప్రసన్న లైఫ్ స్టైల్ నిరంతరం హెడ్ లైన్స్ లోకొస్తోంది.
By: Tupaki Desk | 2 Nov 2024 7:50 AM GMTహైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్టయ్యాక మంచు లక్ష్మీ ప్రసన్న లైఫ్ స్టైల్ నిరంతరం హెడ్ లైన్స్ లోకొస్తోంది. మహా నగరంలో తన స్నేహితురాళ్లు ప్రగ్య జైశ్వాల్, రకుల్ ప్రీత్ లతో లక్ష్మీ ఎప్పుడూ సెలబ్రేషన్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ప్రగ్య, రకుల్ తో ఉంటే తన సొంత కుటుంబంతో ఉన్నట్టేనని లక్ష్మీ మంచు ఎప్పుడూ చెబుతున్నారు. ఆ ముగ్గురి స్నేహం నిజంగానే అభిమానులను అబ్బురపరుస్తోంది.
ఇప్పుడు దీపావళి వేడుకలను మంచు లక్ష్మి తన స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ప్రగ్య ఫ్యామిలీ, రకుల్ ప్రీత్ ఫ్యామిలీతో కలిసి ఉన్న మంచు లక్ష్మి ఫోటోలు వేగంగా ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లాయి. ముంబైలో వైబ్రేంట్ అండ్ కలర్ ఫుల్ పార్టీల్లో ఆ ముగ్గురూ నిరంతరం సందడి చేస్తున్నారు. ఫ్యామిలీస్ తో ఔటింగులు, రెస్టారెంట్ లో డిన్నర్ లు వగైరా ఎప్పుడూ సందడి కనిపిస్తోంది.
ముంబై లో బాలీవుడ్ సెలబ్రిటీల ఇండ్లలో వినాయక చవితి, దసరా ఉత్సవాల అనంతరం, కర్వా చౌత్ (అట్ల తద్ది), దీపావళిని సంబరంగా జరుపుకున్న ఫోటోలు వీడియోలు అబ్బురపరుస్తున్నాయి. సహనటీమణుల కుటుంబాలు సహా ఈ పార్టీల్లో కనిపిస్తుంటే కన్నుల పండుగను తలపిస్తోంది. అలాంటి ఒక పార్టీ నుంచి మంచు లక్ష్మి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
ఐదు రోజుల దీపావళి సంబరం:
ముంబై మెట్రో లో సెలబ్రిటీలు రోజుల తరబడి పండుగలను జరుపుకోవడం.. ఇంటిల్లిపాదీ సరదాగా గడపడం భారతీయ సంస్కృతిని ఆవిష్కరించే ఆచారాలతో సంబరాలు ఆకర్షిస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రగ్యా జైస్వాల్ దీపావళిని `ఐదు రోజుల పాటు` ఎలా జరుపుకుంటుందో వెల్లడించింది. చిన్నప్పటి నుండి దీపావళి తనకు ఇష్టమైన పండుగ అని ..ధంతేరాస్, చోటి దీపావళి, ప్రధాన దీపావళి, గోవర్ధన్ పూజ- భాయ్ దూజ్ తో ఐదు రోజుల పాటు పండుగను జరుపుకుంటానని ప్రగ్య తెలిపింది. ``దీపాల పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటాం. ఇది ధన్తేరస్, చోటి దీపావళి, ప్రధాన దీపావళి, గోవర్థన్ పూజ.. భాయ్ దూజ్‌లతో మొదలవుతుందని అందరికీ తెలుసు అని ప్రగ్యా జైస్వాల్ చెప్పారు. తన కుటుంబంతో ప్రతి రోజు పూజలు ఆచారలతో సంబరంగా ఈ వేడుకను జరుపుకుంటానని తెలిపింది. దీపావళికి ఒక వారం ముందు సంబరాలు ప్రారంభమవుతాయి. ఇది నిజంగా సానుకూల శక్తితో నిండిన ఆహ్లాదకరమైన సమయం`` అని కూడా ప్రగ్య చెప్పింది. తన సినిమా షెడ్యూల్ ని బ్రేక్ చేసి పండుగ కోసం వచ్చానని కూడా ప్రగ్య చెప్పింది. ``నా ప్రియమైన వారితో స్నేహితులు, కుటుంబ సభ్యులతో దీపావళిని గడపడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను`` అని వెల్లడించింది.
భారతీయ పండుగలను నిజంగా ఆస్వాధిస్తాను కాబట్టి నాకు నచ్చినవన్నీ తింటాను. స్వీట్లు తినడం ఇష్టం.. కాబట్టి నేను అన్ని స్వీట్లను ఆస్వాధిస్తానని తెలిపింది.