మంచు లక్ష్మి న్యూ స్టైల్: బోల్డ్ & బ్యూటిఫుల్
ఇటీవల మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త వీడియోను షేర్ చేయడం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది.
By: Tupaki Desk | 30 Oct 2024 9:44 AM GMTఇటీవల మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ కొత్త వీడియోను షేర్ చేయడం సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకుంది. ఈ వీడియోలో, ఆమె ట్రెడిషనల్ లుక్‌ను హై ఫ్యాషన్ గ్లామర్ టచ్ తో ప్రదర్శిస్తూ కనిపించారు. పండగ టైమ్ లో మిఠాయి అంటూ ఒక సరదా క్యాప్షన్ ఇచ్చి, ఆమె తన అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పచ్చటి వృక్షాల మధ్య, తెల్లని డ్రెస్ లో ఎలిగెంట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.
ఈ ఫోటోల్లో ఆమె ధరించిన జువెలరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమెరాల్డ్ స్టోన్స్, ముత్యాలతో అలంకరించిన చెవి రింగ్స్, నెక్లెస్, చూడీలు అన్నీ కలిపి ఆమె గ్లామర్ లుక్ కి మరింత అందాన్ని తెచ్చాయి. మన తెలుగులో చాలా మంది హీరోయిన్లు తమ గ్లామర్ ప్రెజెన్స్ ను సింపుల్ గా ప్రదర్శిస్తుంటారు కానీ, మంచు లక్ష్మి మాత్రం తన స్టైల్ స్టేట్ మెంట్ ను ప్రత్యేకంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఈ వీడియోలో ఆమె చూపించిన కిల్లింగ్ లుక్స్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేశాయి.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి, తరచూ తన కొత్త లుక్స్ ను అభిమానులతో పంచుకుంటూ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టే ప్రతి ఫోటో అనేది కేవలం ఫ్యాషన్ ఫ్యాన్స్ ని మాత్రమే కాదు, మరింత అభిమానులను తన వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియో ద్వారా, ఆమె తన వయసుతో సంబంధం లేకుండా గ్లామర్ కి మరింత దగ్గరగా ఉంటుందని మరోసారి నిరూపించారు.
సోషల్ మీడియాలోని ఫాలోవర్స్ కూడా ఆమె లుక్స్ కి ఫిదా అవుతూ విపరీతమైన జోష్ లో లైకులు, కామెంట్లు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి యొక్క ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో, ప్రత్యేకంగా ‘ఆదిపర్వం’ సినిమా, బాగా క్రేజ్ లో ఉంది. పిరియడిక్ బ్యాక్ డ్రాప్ లో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ లుక్ లో కనిపించిన మంచు లక్ష్మి కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె బాలీవుడ్ లో కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయిన ఆమె, అక్కడ కూడా కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తానికి, ఈ వీడియో ద్వారా తన స్టైల్ సెన్స్ తో పాటు, తన నటనా ప్రావీణ్యం కూడా చూపిస్తున్న మంచు లక్ష్మి, తెలుగులో మాత్రమే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే తపనను వ్యక్తం చేస్తున్నట్లు అనిపిస్తోంది.