ఫ్యామిలీ గొడవ.. ఇంతకీ మంచు లక్ష్మి ఎక్కడ?
మంచు కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్న విభేదాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
By: Tupaki Desk | 11 Dec 2024 8:25 AM GMTమంచు కుటుంబంలో ప్రస్తుతం నెలకొన్న విభేదాలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ వైపు మనోజ్ మరోవైపు మోహన్ బాబు ఇద్దరు కూడా ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గోడవ ఎక్కడ మొదలైంది అనే విషయంలో ఇప్పటికే చాలా రకాల కథనాలు వస్తున్నాయి. ఆస్తులు అడగలేదు అని మనోజ్ అంటుండగా మోహన్ బాబు మాత్రం ఆస్తుల విషయంలో ఒక సీరియస్ ఆడియో నోట్ విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇక రోజు రోజుకు గోడవ సీరియస్ గా మారుతున్న క్రమంలో మంచు ఫ్యామిలీకి సంబంధించిన అనేక రకాల విషయాలు వైరల్ అవుతున్నాయి. అయితే మంచు లక్ష్మి పేరు మాత్రం ఎక్కడ వినిపించడం లేదు. అసలు ఆమె ఎక్కడున్నారు? అనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే మంచు లక్ష్మి గత కొంతకాలంగా ఈ కుటుంబ వివాదాలకు దూరంగా ఉంటూ తన జీవితంలో కొత్త మార్పులకు దారి తీర్చుకున్నారని తెలుస్తోంది.
కొన్ని నెలల క్రితమే ముంబైకి మకాం మార్చిన మంచు లక్ష్మి, తన వ్యక్తిగత జీవనశైలిని, సినీ ప్రయాణాన్ని అక్కడే కొనసాగిస్తున్నారు. అలాగే ముంబైలో హోమ్ టూర్ వీడియో ద్వారా తన ఇంటిని పరిచయం చేస్తూ, హై ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొంటూ, సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల మంచు కుటుంబంలో తండ్రి మోహన్ బాబు, కొడుకులు విష్ణు మనోజ్ మధ్య విభేదాలు ముదిరినట్లు వార్తలు వచ్చాయి.
ఈ సంఘటనల మధ్య మంచు లక్ష్మి ముంబై నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. తండ్రి, సోదరులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆమె, పరిస్థితిని చక్క దిద్దేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే, ఎవరి వైపు వారు తమ స్థాయిని తగ్గించడానికి సిద్ధంగా లేరని ఆమెకు అర్థమైంది. ఈ కారణంగా లక్ష్మి ఎవరికి చెప్పలేక వెంటనే ముంబైకి తిరిగి వెళ్ళిపోయారని సమాచారం.
తన కుటుంబంలో విభేదాలను పరిష్కరించడానికి తన వంతు ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి వర్కౌట్ కాకపోవడంతో, చివరికి ఈ గొడవల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఫిల్మ్ నగర్‌లోని తన నివాసం మంచు లక్ష్మి పేరునే ఉండగా, ఆస్తుల విషయంలో తండ్రితో ఎలాంటి అభ్యంతరం లేకుండా ఆమె ఈ వ్యవహారంలో సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇక మనోజ్ అంటే కూడా ఆమెకు ప్రత్యేకమైన ఆప్యాయత ఉంది. ఎందుకంటే మనోజ్ రెండో పెళ్లి విషయంలో మిగతా కుటుంబ సభ్యుల నిర్ణయం వేరేలా ఉన్నా కూడా.. లక్ష్మి తన ఇంట్లోనే ఈ పెళ్లి జరిపించారు. ఆ సమయంలో కుటుంబానికి అనుకూలంగా నిలిచిన లక్ష్మి, ఇప్పుడు మాత్రం ఎవరి పక్షానా మాట్లాడకుండా దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీ గొడవలు మరింత ముదిరితే సమస్యలు పెరుగుతాయని ఆమె భావించి, కుటుంబ సంబంధాలకు హాని కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.