Begin typing your search above and press return to search.

మంచు ఫ్యామిలీ గొడవలు.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్

ఈ పోస్ట్‌పై మంచు మనోజ్ భార్య భూమా మౌనిక చేసిన స్పందన కూడా కొత్త చర్చకు దారితీసింది.

By:  Tupaki Desk   |   11 Dec 2024 12:06 PM GMT
మంచు ఫ్యామిలీ గొడవలు.. మంచు లక్ష్మి పోస్ట్ వైరల్
X

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీ మధ్య జరుగుతున్న విభేదాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఆస్తులు, వ్యక్తిగత సంబంధాల చుట్టూ ముదిరిన ఈ గొడవలు, కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు మరింత తీవ్రతరం చేసాయి. ఈ సందర్భంలో మంచు లక్ష్మి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై మంచు మనోజ్ భార్య భూమా మౌనిక చేసిన స్పందన కూడా కొత్త చర్చకు దారితీసింది.

ఈ వివాదాల నేపథ్యంలో మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'పీస్' అంటూ తన కూతురి వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు, ఈ పోస్ట్ ద్వారా మంచు లక్ష్మి ఏదో సంకేతాన్ని ఇస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు, ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇలా స్పందించడం సమంజసమని పేర్కొనగా, మరికొందరు మాత్రం కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఆమె దగ్గరగా ఉండకుండా ఆమె పక్కకు తప్పుకుంటున్నారని భిన్నంగా స్పందిస్తున్నారు. ఇక మరికొందరు అది ఆమె వ్యక్తిగత విషయమని సపోర్ట్ చేస్తున్నారు.

ఈ పోస్ట్‌కు మంచు మనోజ్ భార్య భూమా మౌనిక లైక్ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. మంచు ఫ్యామిలీలో తండ్రి, అన్నదమ్ముల మధ్య ఈ స్థాయిలో గొడవలు జరుగుతున్నా, లక్ష్మి వాటిపై నేరుగా స్పందించకపోవడం పట్ల అనేక రకాల సందేహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా, లక్ష్మి 'శాంతి' అనే సందేశం ఇవ్వడం, మనోజ్ భార్య దానికి మద్దతు తెలపడం మరింత వైరల్ గా మారింది.

మంచు లక్ష్మి గత కొన్ని నెలలుగా ఈ వివాదాల నుంచి దూరంగా ఉంటూ, తన జీవితాన్ని ముంబైలో కొనసాగిస్తున్నారు. ముంబైలో హై ప్రొఫైల్ పార్టీలకు హాజరవుతూ, కొత్త జీవితానికి రూపకల్పన చేస్తూ, ఫిల్మ్ నగర్ వ్యవహారాలను పూర్తిగా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. కానీ కుటుంబ విభేదాలు తీవ్రంగా మారిన నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ వచ్చి తన తండ్రి, సోదరులతో మాట్లాడినట్లు సమాచారం. అయినా కూడా వీరి మధ్య సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు లేకపోవడంతో, ఆమె తిరిగి ముంబైకి వెళ్లిపోయారని తెలుస్తోంది.

తన కుటుంబానికి అవసరమైన సమయంలో మంచు లక్ష్మి సపోర్ట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తుల వివాదం మరింత వేడిగా మారడంతో ఆమె వారి వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవం ఇచ్చి పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక, మంచు ఫ్యామిలీ సమస్యలు ఎక్కడికి దారితీస్తాయో అనేది ఇప్పటికి అనుమానంగా ఉంది. ఫ్యామిలీ గొడవలు ఎప్పటికి శాంతిస్తాయనే దానిపై ఎటువంటి సంకేతాలు లేవు. మంచు లక్ష్మి చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, ఆపై వచ్చిన మౌనిక స్పందన చూస్తుంటే వారు మళ్ళీ కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు అర్ధమవుతుంది.