మనోజ్ - మౌనిక.. మంచు లక్ష్మి ఎమోషనల్ రియాక్షన్!
నేటితో వీరి వివాహ బంధానికి రెండేళ్లు పూర్తి కావడంతో మౌనిక భూమా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
By: Tupaki Desk | 3 March 2025 4:50 PM ISTటాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఈమధ్య కాలంలో సినిమాల అప్డేట్స్ కంటే కూడా ఫ్యామిలీ వివాదాలతోనే వార్తల్లో నిలిచాడు. అలాగే సెకండ్ ఇన్నింగ్స్ తరహాలో విలన్ గా కూడా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే మిరాయ్ అనే సినిమా షూటింగ్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇందులో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక సినీ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ కు ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు.
భూమా మౌనికను మనోజ్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. నేటితో వీరి వివాహ బంధానికి రెండేళ్లు పూర్తి కావడంతో మౌనిక భూమా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. తన కుటుంబం, భర్త, పిల్లల గురించి తీయని మాటలతో రాసిన ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ సైతం పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మౌనిక భూమా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అందమైన ఫ్యామిలీ ఫొటో షేర్ చేస్తూ, మనిద్దరం కలిసి ముందుకు వెళ్లాలని, జీవితాన్ని మరింత ప్రేమతో ముంచెత్తాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పింది.
"మనిద్దరం ఒకరినొకరు కలుసుకోవడం, ఒకరిపై ఒకరం నమ్మకాన్ని పెంచుకోవడం నిజంగా గొప్ప అనుభూతి. నువ్వు నాకు ఇంత అందమైన కుటుంబాన్ని అందించావు. మన ప్రయాణం ఇలాగే ఆనందంగా కొనసాగాలని కోరుకుంటున్నా. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్.. లెట్స్ రాక్ అండ్ రోల్!" అంటూ తన భర్తను ప్రేమగా సంబోధించింది.
ఈ పోస్టుకు తాను ఎప్పుడూ మరిచిపోలేని ఓ కుటుంబ బంధం ఉన్నట్లు భావిస్తున్నట్లు మౌనిక పేర్కొనగా, ఇందులో చిన్నారి దేవసేన, ధైరవ్ కూడా ఉండటంతో ఫ్యాన్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మౌనిక తన భర్త మనోజ్‌ను, పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తుందో ఈ మాటల్లో ప్రతిబింబించింది. ఈ పోస్ట్ చూసిన మంచు లక్ష్మి ఎమోషనల్‌గా స్పందించారు. "నీ పోస్ట్ భలే బాగుంది మౌనిక.. మీ నలుగుర్నీ ఎంతో ప్రేమిస్తున్నాను. ఎప్పుడూ ఇలాగే ప్రేమగా, సంతోషంగా కలిసుండాలి. మీరు ఎప్పుడూ హ్యాపీ ఫ్యామిలీలా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ ప్రేమతో కూడిన కామెంట్ చేశారు.
ఆమె స్పందన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే మంచు మోహన్ బాబు - మంచు విష్ణు ఒకటిగా ఉండగా ఫ్యామిలీలో మనోజ్ మరోవైపు ఉండడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక మంచు లక్ష్మి గొడవలకు దూరంగానే ఉన్నారు. ఇక ఆమెకు విష్ణు అంటే కొడుకుతో సమానం అని చాలాసార్లు చెప్పింది. మౌనికతో పెళ్లి కూడా లక్ష్మీ ఇంట్లోనే జరిగింది. ఇక ఫ్యామిలీ విషయాలు ఎలా ఉన్నా కూడా ఆమె మంచు మనోజ్ తో ప్రేమగానే ఉన్నట్లు మరోసారి రుజువైంది.