మంచు మనోజ్ కడుపు, వెన్నెముకలో గాయాలు... విష్ణు కీలక నిర్ణయం!!
మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారంటూ కూడా ప్రచారం తీవ్రంగా జరిగింది.
By: Tupaki Desk | 9 Dec 2024 7:13 AM GMTఆస్తుల విషయంలో మోహన్ బాబు, ఆయన తనయుడు మనోజ్ మధ్య గొడవ జరిగిందని.. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారంటూ ఆదివారం ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మనోజ్ గాయాలతో వచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారంటూ కూడా ప్రచారం తీవ్రంగా జరిగింది.
ఈ నేపథ్యంలో విష్ణు పీఅర్వో టీమ్ స్పందించింది.. అదంతా అసత్య ప్రచారం అని కొట్టివేసింది. అసత్య ప్రచారాలు చేయొద్దంటూ ఆ వార్తలు రాసిన మీడియాకు సూచించింది. ఈ క్రమంలో... ఆదివారం మనోజ్ కాలి గాయంతో ఆసుపత్రికి వచ్చారు. దీంతో... అటు ఇండస్ట్రీలోనూ, ఇటు మీడియాలోనూ మరోసారి చర్చనీయాంశం అయ్యింది.
ఆ సమయంలో నడవాడనికి కాస్త ఇబ్బంది పడుతున్నట్లు మనోజ్ కనిపించారు. అయితే... కాలికి గాయం ఎలా అయ్యింది? ఉదయం నుంచి వస్తున్న వార్తలు నిజమేనా? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మనోజ్ కానీ, ఆయన సతీమణి కానీ స్పందించలేదు! ఈ నేపథ్యంలో... మనోజ్ మెడికో లీగల్ రిపోర్ట్ వచ్చిందనే విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఆదివారం మనోజ్ ఆస్పత్రికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. దీనికి సంబంధించిన మెడికో లీగల్ రిపోర్ట్ తెరపైకి వచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... మనోజ్ కు కడుపు, వెన్నెముక, ఎడమ కాలి పిక్క భాగంలో దెబ్బలు తగిలాయని.. మెడపై గోళ్లతో రక్కిన ఆనవాళ్లు ఉన్నాయని తేలిందని అంటున్నారు!
మరోవైపు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ లు పరస్పరం ఒకరిపై ఒకరు డయల్ 100 ద్వారా ఫిర్యాదు చేశారని అంటున్నారు . ఈ నేపథ్యంలో... స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయాలని ఇరువురుకీ పోలీసులు సూచించినట్లు చెబుతున్నారు!
ఆ సంగతి అలా ఉంటే... దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్న అనంతరం మనోజ్ ను కలుస్తున్నట్లు తెలుస్తుంది . మరోపక్క.. అంతకంటే మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెట్టె ఛాన్స్ ఉంది అని అంటున్నారు . దీంతో..మనోజ్ ప్రెస్ మీట్ పై తీవ్ర ఆసక్తి నెలకొందని తెలుస్తోంది.