Begin typing your search above and press return to search.

చిరిగిన చొక్కాతో బయటకొచ్చిన మనోజ్... దాడి చేసింది వారేనా?

దీంతో... ఆగ్రహంతో కారు దిగి బయటకు వచ్చిన మనోజ్.. గేట్లు నెట్టుకుని బలవంతంగా లోపలికి ప్రవేశించారు!

By:  Tupaki Desk   |   10 Dec 2024 4:57 PM GMT
చిరిగిన చొక్కాతో బయటకొచ్చిన మనోజ్... దాడి చేసింది వారేనా?
X

జల్ పల్లిలో మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ అడిషనల్ డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు నివాసానికి చేరుకోగా.. వారు లోపలికి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో... ఆగ్రహంతో కారు దిగి బయటకు వచ్చిన మనోజ్.. గేట్లు నెట్టుకుని బలవంతంగా లోపలికి ప్రవేశించారు!

దీంతో.. అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమయంలో మనోజ్ తన భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు! ఈ సమయంలో మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారని అంటున్నారు. ఈ సమయంలో లోపలికి వెళ్లిన మనోజ్.. చిరిగిన చొక్కాతో బయటకు వచ్చారు!

ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. దీంతో.. లోపల మనోజ్ పై ఎవరు దాడి చేశారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనోజ్ పై మోహన్ బాబు, విష్ణు బౌన్సర్లు దాడి చేసినట్లు కథనాలొస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. మీడియా ప్రతినిధుల చేతిలోని మైకులు లాక్కుంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు!

మరోవైపు... మనోజ్ కు గాయాలయ్యాయని.. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేటు కేసు వేస్తా అని.. మనోజ్ సెక్యూరిటీని తీసేస్తున్నారని.. మా బౌన్సర్లను కానిస్టేబుళ్లు పంపించేశారని.. న్యాయంగా వ్యవహరించాలని అంటూ మనోజ్ భార్య మౌనిక స్థానిక పోలీసులతో స్ట్రాంగ్ గా మాట్లాడినట్లు చెబుతున్న వీడియో వైరల్ గా మారింది!

కాగా... ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన సమయంలో మంచు మనోజ్ సరిగా నడవలేకపోయినట్లు కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోజు వచ్చిన మెడికో లీగల్ రిపోర్ట్ లో.. ఆయన కడుపులోనూ, వెన్నెముఖకు గాయాలైనట్లు ఉందని, మెడపై గోళ్లతో రక్కినట్లు ఉందని కథనాలొచ్చాయి! దీంతో... ఇప్పుడు మనోజ్ పై దాడిలో జరిగి ఉంటే.. గాయాలయ్యాయా లేదా అనేది తెలియాల్సి ఉంది!