రాజధానిలో కన్నప్ప ప్రచారమా!
ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ కు ముందు రాజధాని ఢిల్లీలో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తు న్నారుట.
By: Tupaki Desk | 4 April 2025 12:00 PMతెలుగు సినిమా ప్రచారం పాన్ ఇండియాని తాకిన సంగతి తెలిసిందే. చెన్నై, బెంగుళూరు, కొచ్చి, ముంబై, పాట్నా, చండీఘర్ అంటూ అన్ని రాష్ట్రాలు తిరిగేస్తున్నారు. సినిమా ప్రచారం అంటే ఎలా ఉంటుందో? ఆయా రాష్ట్రాలకు రుచి చూపిస్తున్నారు. ఇదంతా అక్కడ వాళ్లకు కొత్తగా ఉంది. నేరుగా ప్రేక్షకులతో హీరోలు ఇంటరాక్ట్ అవ్వడంతో? థ్రిల్లింగ్ ఫీలవుతున్నారు.
పబ్లిక్ గా ఈవెంట్లు నిర్వహించడంతో ఆడియన్స్ తెలుగు హీరోలకు కనెక్ట్ అవుతున్నారు. బన్నీ ..చరణ్ కి ఆ రకంగా మంచి కనెక్టింగ్ ఏర్పడిని సంగతి తెలిసిందే. `పుష్ప-2`,` గేమ్ ఛేంజర్` ప్రచారం నార్త్ లో ఏ రేంజ్ లో జరిగిందే విధితమే. ఇప్పుడిదే కోవలో మంచు ఫ్యామిలీ కూడా ప్రచారం ప్లాన్ చేస్తున్నట్లు లీకులందాయి. మంచు విష్ణు కథానాయకుడిగా ప్రతిష్టాత్మకంగా `కన్నప్ప` చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ సహా చాలా మంది స్టార్ హీరోలు నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రమిది. అన్నింటిని మించి ఇది శివయ్య కథ కావడంతో? అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. హిందుత్వం అంశం ఇక్కడ హైలైట్ అవుతుంది. సరిగ్గా ఇదే పాయింట్ ని పట్టుకుని ప్రచారం పరంగా కలిసొచ్చే వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ కు ముందు రాజధాని ఢిల్లీలో ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తు న్నారుట. ఆ ఈవెంట్ కు ప్రభాస్ , మోహన్ లాల్ సహా అంతా హాజరయ్యేలా వాళ్ల వెసులుబాటును బట్టి ఈవెంట్ తేదీని ఫిక్స్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు ఉప్పందింది. నిజంగా రాజధాని నడి బొడ్డున ఇలాంటి సినిమా ప్రచారం అన్నది కలిసొచ్చేదే. మోదీ, షాలు హిందు వాదులు కాబట్టి సినిమాకి కొన్ని రకాల మినహాయింపులు దక్కే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా సులభంగా దక్కుతాయి. మరి ఇదంతా నిజమా? కాదా? అన్నది నిర్మాతల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.