కన్నప్ప నా జీవితాన్నే మార్చేసింది
భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నటిస్తూ నిర్మిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
By: Tupaki Desk | 26 March 2025 1:12 PMమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తో పాటూ పలువరు స్టార్ క్యాస్ట్ భాగమైంది. భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు నటిస్తూ నిర్మిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్ వేగాన్ని పెంచాడు. అందులో భాగంగానే పలు పట్టణాలకు వెళ్తూ, అక్కడ కన్నప్ప సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. రీసెంట్ గా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కన్నప్ప సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
కన్నప్ప సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి తన లైఫ్ ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్తోన్న విష్ణు, శివ లీల వల్లే అదంతా జరిగిందనిపిస్తుందన్నాడు. కన్నప్ప మూవీ తనను ఎంతగానో మార్చేసిందని, నటుడిగా కూడా తన జీవితం కన్నప్పకు ముందు, కన్నప్పకు తర్వాత అన్నట్టు మారిందని, ఈ సినిమా తనకొక బేబీ లాంటిదని విష్ణు తెలిపాడు.
చిన్నప్పుడు జరిగిన ఒక సిట్యుయేషన్ వల్ల నాస్తికుడిగా మారిన తిన్నడికి శివుని అనుగ్రహం ఎలా కలుగుతుందనే అంశంపైనే కథ మొత్తం ఉంటుందని విష్ణు చెప్పాడు. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు తాను ఎలాంటి ఆహార నియమాలు పాటించలేదని చెప్పిన విష్ణు, తిన్నడు కన్నప్పగా మారినప్పటి నుంచి మూవీ షూటింగ్ అయిపోయే వరకు తాను నేలపైనే పడుకున్నట్టు వెల్లడించాడు.
అసలు కన్నప్ప కథపై ప్రభాస్ సినిమా తీస్తా అని చెప్పి ఉంటే తాను ఈ సినిమాను చేసేవాడినే కాదని చెప్తున్న విష్ణు, తమ సినిమాపై కృష్ణంరాజు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పాడు. ఈ మూవీలో చూపించిన లింగం గురించి వచ్చిన విమర్శలపై కూడా విష్ణు మాట్లాడాడు. భూమి మొత్తమ్మీద వాయు లింగం శ్రీ కాళహస్తిలోనే ఉందని, తమ సినిమాలో చూపించిన లింగాకారం ఎలా ఉంటుందో శ్రీ కాళహస్తి గుడిలో కూడా అలానే ఉంటుందని విష్ణు క్లారిటీ ఇచ్చాడు.