కెరీర్ ఆరంభంలో నన్ను ఇబ్బంది పెట్టారు: మంచు లక్ష్మి!
ఈ నివేదికపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. నివేదికలో ఏముందో తనకు తెలియదని చెబూతూనే ఇలా స్పందించింది.
By: Tupaki Desk | 22 Aug 2024 5:51 AM GMTజస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు మాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. చెప్పుకోడానికి చిన్న పరిశ్రమ అయినా లైంగిక దాడులు ఏ స్థాయిలో జరిగాయన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ప్రస్తుత దేశం వ్యాప్తంగా హేమ కమిటీ నివేదికపైనే చర్చ సాగుతోంది. అన్ని పరిశ్రమల్లోనూ హాట్ టాపిక్ గా మారిన అంశం ఇది. కొన్ని గంటల క్రితమే బాలీవుడ్ మాజీ నటి తను శ్రీ దత్తా కమిటీలు వేసి సాధించింది ఏంటి? అంటూ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నివేదికపై టాలీవుడ్ నటి మంచు లక్ష్మి స్పందించింది. నివేదికలో ఏముందో తనకు తెలియదని చెబూతూనే ఇలా స్పందించింది. 'ఈ సమాజంలో మహిళలకు సరైన చోటు లేదు. ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుంటున్నా. మహిళలకు సమాజంలో సమానత్వం ఉండాలి. అన్యాయం జరిగిన వెంటనే బయటకు వచ్చి మాట్లాడాలి. నువ్వు ఎవరితో చెప్పలేవని, అంత ధైర్యం నీకు లేదని భావించిన కొంత మంది వ్యక్తులు నిన్ను ఇబ్బందికి గురిచేయడానికి ప్రయత్నిస్తారు.
అలాంటి వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. కెరీర్ మొదలు పెట్టిన సమయంలో నన్ను కొంత మంది ఇబ్బంది పెట్టారు. వారితో నేను చాలా దురుసుగా ప్రవర్తించేదాన్ని. అలా చేయడం వల్ల ఉద్యోగం పోగొ ట్టుకున్నా' అంది. అలాగే కోల్ కత్తా డాక్టర్ అత్యాచార ఘటనపైనా స్పందించింది. జూనియర్ డాక్టర్ ఘటన నన్ను షాక్ కి గురి చేసింది. ఆమెకు వెంటనే న్యాయం జరగాలి.
సమాజంలో అలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాంటి ఆలోచన రావాలంటేనే భయం పుట్టాలి' అని అంది. ప్రస్తుతం మంచు లక్ష్మి టాలీవుడ్ లో రాణిస్తోన్న సంగతి తెలిసందే. రెండేళ్ల క్రితమే 'మోన్ స్టర్' సినిమాతో మంచు లక్ష్మి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మళ్లీ అక్కడ రెండవ సినిమా చేయలేదు.