Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి గ్లామర్.. బాలీవుడ్ భామలకు ధీటుగా..

సరైన క్యారెక్టర్ పడితే నటిగా ఆమె విశ్వరూపం చూపిస్తుందని ఆ మూవీ నిరూపించింది.

By:  Tupaki Desk   |   25 Aug 2024 4:44 AM GMT
మంచు లక్ష్మి గ్లామర్.. బాలీవుడ్ భామలకు ధీటుగా..
X

మంచు ఫ్యామిలీ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ మంచు లక్ష్మి. అనగనగా ఒక ధీరుడు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి మొదటి చిత్రంతోనే మంచు లక్ష్మి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సరైన క్యారెక్టర్ పడితే నటిగా ఆమె విశ్వరూపం చూపిస్తుందని ఆ మూవీ నిరూపించింది. తరువాత గుండెల్లో గోదారి సినిమాలో విలేజ్ టచ్ తో హీరోయిన్ గా మెరిసింది.


ఈ మూవీలో కూడా తన నాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మంచు లక్ష్మి డైలాగ్స్ కూడా భిన్నమైన మాడ్యులేషన్ లో ఉంటాయి. ఆమె ఒరిజినాలిటీని చాలా మంది ఇష్టపడతారు. చందమామ కథలు సినిమాలో కూడా మంచు లక్ష్మి మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇలా కెరియర్ లో భిన్నమైన క్యారెక్టర్స్ లలో మంచు లక్ష్మి కనిపించింది. మంచు లక్ష్మి చివరిగా మలయాళంలో మోహన్ లాల్ మాన్ స్టర్ సినిమాలో విలన్ పాత్రలో నటించింది.


ఇందులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా మంచు లక్ష్మి చేయడం విశేషం. మంచు లక్ష్మి త్వరలో ఆదిపర్వం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. రీసెంట్ గా యక్షిణీ వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి కీలక పాత్రలో కనిపించింది. నిజానికి ఆమె కెరియర్ స్టార్ట్ చేసింది హాలీవుడ్ మూవీస్, వెబ్ సిరీస్ లతో అని చాలా తక్కువ మందికి తెలుసు.


అయితే మాతృభాషలో నటించాలనే ఉద్దేశ్యంతో ఆమె ఇండియా వచ్చింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కూడా పవర్ ఫుల్ పాత్రలలో కనిపించాలని మంచు లక్ష్మి ప్రస్తుతం ప్రయత్నం చేస్తోంది. అందుకు ఇన్ స్టాగ్రామ్ వేదికగా మార్చుకొని రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోషూట్ లతో మంచు లక్ష్మి సందడి చేస్తోంది.

ఈ ఫోటోలలో మంచు లక్ష్మి చాలా అందంగా కనిపిస్తోందనే కామెంట్స్ ఆమె ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి. తాజాగా వైట్ కలర్ షర్టు, షార్ట్ జీన్స్ లో లక్ష్మి ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో బెస్ట్ ప్రొఫైల్ పిక్ సెలక్ట్ చేయాలని ఫ్యాన్స్ ని కోరింది. ఈ ఫోటోలలో మంచు లక్ష్మి చాలా స్టైలిష్ గా మోడ్రన్ గర్ల్ గా మెరిసిపోతోందనే మాట వినిపిస్తోంది.