బ్లాక్ డ్రెస్ లో మంచు లక్ష్మీ స్టన్నింగ్ షో
బ్లాక్ కలర్ ఫ్రాక్ లో కెమెరాలో బంధించిన అందాలని నిండుగా ఆవిష్కరిస్తూ బ్యూటీ స్పాట్స్ ని ఎలివేట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 21 Sep 2023 4:09 AM GMTమంచు మోహన్ బాబు కూతురు అనే బ్రాండ్ తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ మంచు లక్ష్మి. అనగనగా ఒక ధీరుడు అనే సినిమాలో ఐరేంద్రి అంటూ నెగిటివ్ రోల్ లో మొదటిగా బిగ్ స్క్రీన్ పై ఈ బ్యూటీ కనిపించి అందరిని భయపెట్టింది. తరువాత నాటుగా డిఫరెంట్ రోల్స్ చేస్తూ తన కెరియర్ కొనసాగిస్తోంది. మరో వైపు హోస్ట్ గా బుల్లితెరపైన కూడా సక్సెస్ అయ్యింది.
అయితే సినిమాలకి చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చిన మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా తన అప్డేట్స్ అందిస్తూ ఉన్నారు. కొన్ని విషయాలపై ఇంటరెస్టింగ్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఏపీ రాజకీయాలలో ఆ మధ్య మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫ్యాషన్ పరంగా కూడా మంచు లక్ష్మి హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటుంది.
ఫుల్ గా వర్క్ అవుట్స్ చేస్తూ తన లుక్స్ కూడా ఇంప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఈ మధ్య బోల్డ్ షోకి కూడా తెరతీశారు. ఫ్యాషన్ దుస్తులు ధరిస్తూ తనలోని గ్లామర్ ని షోకేస్ చేసుకునే ప్రయత్నం మంచు లక్ష్మి చేస్తోంది. అందులో భాగంగా అదిరిపోయే హాట్ ఫోటోషూట్ లతో సందడి చేస్తోంది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరోసారి అదిరిపోయే స్టైల్ లో గ్లామర్ డాల్ గా ఇన్ స్టాగ్రామ్ లో మంచు లక్ష్మి మెరిసిపోతోంది. బ్లాక్ కలర్ ఫ్రాక్ లో కెమెరాలో బంధించిన అందాలని నిండుగా ఆవిష్కరిస్తూ బ్యూటీ స్పాట్స్ ని ఎలివేట్ చేస్తూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఈ వయస్సులో కూడా గ్లామర్ పరంగా హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా మంచు లక్ష్మి అందాలు ఉండటం విశేషం.
టాలీవుడ్ దర్శకులు కరెక్ట్ గా ఫోకస్ చేస్తే మంచు లక్ష్మిని గ్లామర్ బ్యూటీగా ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉందని ఈ పిక్స్ చూస్తుంటే తెలుస్తోంది. సీరియస్ గా ట్రై లేదు కానీ చేసుకుంటే తన అందం ఈ లెవల్ లో ఉంటుందనే మీనింగ్ వచ్చేవిధంగా ఈ ఫోటోలకి మంచు లక్ష్మి క్యాప్షన్ కూడా ఇవ్వడం విశేషం.