Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి ముంబై ఇల్లు ప్రత్యేకతలు..!

అక్కడ సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతున్న మంచు లక్ష్మి తన ముంబై ఇంటిని చూపించింది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 6:45 AM GMT
మంచు లక్ష్మి ముంబై ఇల్లు ప్రత్యేకతలు..!
X

టాలీవుడ్‌ స్టార్‌ మోహన్‌ బాబు ఇంటిని ఆ మధ్య మంచు లక్ష్మి తన యూట్యూబ్‌ ఛానల్‌ లో చూపించిన విషయం తెల్సిందే. మోహన్‌ బాబు ఇంటిని చూసి చాలా మంది అప్పుడు వావ్‌ అనుకున్నారు. స్వర్గం మాదిరిగా ఉందంటూ మోహన్ బాబు ఇంటి గురించి నెటిజన్స్ మాట్లాడుకున్నారు.

ఇప్పుడు మంచు లక్ష్మి తన ముంబై ఇంటిని యూట్యూబ్‌ ద్వారా చూపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. గత కొన్నాళ్లుగా ఈమె ముంబైలో ఉంటున్నారు. ముంబై షిప్ట్‌ అయిన ఈమె అక్కడ శాస్వత నివాసం ఏర్పర్చుకున్నారు. అక్కడ సినిమాల్లో నటించేందుకు సిద్ధం అవుతున్న మంచు లక్ష్మి తన ముంబై ఇంటిని చూపించింది.

ముంబై లో ఇల్లు తీసుకోవాలి అనుకున్న సమయంలో దాదాపు 28 ఫ్లాట్స్ ను చూసినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. అద్భుతమైన వ్యూ కోసం మంచి ప్లానింగ్ తో ఉన్న ఈ ఇంటిని తీసుకున్నట్లుగా ఆమె పేర్కొంది. ఇక ఈ ఇంటి కోసం చాలా వరకు వస్తువులను హైదరాబాద్ నుంచి తెప్పించినట్లుగా కూడా ఆమె పేర్కొంది.

మంచు లక్ష్మి షేర్ చేసిన తన ఇంటి వీడియో వైరల్‌ అయ్యింది. ఇంత రిచ్ గా ఇల్లును ఎలా కట్టుకుంటారో, ఇంత అద్భుతమైన ఇంటీరియర్ ను ఎలా చేసుకుంటారో అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి ముంబై ఇంటికి సంబంధించిన వీడియోను మీరు ఇక్కడ చూసేయండి.