Begin typing your search above and press return to search.

టాలీవుడ్ డైరెక్టర్ మృతి.. యువ హీరో ఎమోషనల్ కామెంట్స్

నువ్వు లేకుండా జీవితం హ్యాపీగా ఒకప్పటిలా అయితే ఉండదు. ఎప్పటికి నిన్ను అభిమానిస్తూనే ఉంటాను అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

By:  Tupaki Desk   |   2 Aug 2024 9:47 AM GMT
టాలీవుడ్ డైరెక్టర్ మృతి.. యువ హీరో ఎమోషనల్ కామెంట్స్
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి దర్శకుడిగా ఎదగాలని అనుకున్న మరో ఫిల్మ్ మేకర్ కన్నుమూశారు. మంచు మనోజ్ తో నేను మీకు తెలుసా సినిమా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ శాస్త్రీ మరణించారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ అఫీషియల్ గా ధ్రువీకరించారు. సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతూ ఒక వివరణ ఇచ్చారు. అజయ్ శాస్త్రీతో నేను మీకు తెలుసా మూవీ సమయంలో కలిగి దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు.

నా బెస్ట్ ఫ్రెండ్, నేను మీకు తెలుసా? డైరెక్టర్ అజయ్ మరణవార్త నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన కుటుంబసభ్యులకి, ఆత్మీయులకి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను. నిన్ను ఎప్పటికి మిస్ అవుతూనే ఉంటాను. నువ్వు లేకుండా జీవితం హ్యాపీగా ఒకప్పటిలా అయితే ఉండదు. ఎప్పటికి నిన్ను అభిమానిస్తూనే ఉంటాను అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. అజయ్ శాస్త్రీ మొదట రానా దగ్గుబాటి నిర్మాణంలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ షార్ట్ ఫిల్మ్ కు మంచి గుర్తింపు లభించింది.

కృష్ణవంశీ దగ్గర డేంజర్, రాఖీ సినిమాలకి దర్శకత్వ విభాగంలో, స్క్రీన్ రైటర్ గా కూడా వర్క్ చేశారు. ఇక దర్శకుడు కావాలని అతను అప్పటి టాలీవుడ్ యువ హీరోలతో గట్టిగానే ప్రయత్నాలు చేశాడు. ఇక మొదట మంచు మనోజ్ తో అతనికి మంచి స్నేహం ఏర్పడింది. దీంతో అజయ్ శాస్త్రీ టాలెంట్ గుర్తించి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అలా నేను మీకు తెలుసా సినిమాతో దర్శకుడిగా మారాడు.

డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. మేకింగ్ విషయంలో మాత్రం అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే ఈ సినిమా సాంగ్స్ కూడా హిట్ అయ్యాయి. మనోజ్ కెరియర్ లో బెస్ట్ సాంగ్స్ ఉన్న మూవీస్ అంటే 'నేను మీకు తెలుసా' పేరు కూడా వినిపిస్తుంది. 2008లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది.

ఆ తర్వాత ఆయన నుంచి దర్శకుడిగా సినిమాలు రాలేదు. ఇప్పుడు ఆయన మరణానికి కారణం ఏంటనేది కూడా పూర్తిగా తెలియదు. 2008 తరువాత కూడా మనోజ్ ఇదే కాంబినేషన్లో మరో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ హీరోగా మనోజ్ కాస్త బ్రేక్ తీసుకోవడంతో అజయ్ కి కూడా దర్శకత్వం చేసే ఛాన్స్ రాలేదు. ఇక ఇండస్ట్రీలో అజయ్ సన్నిహితులు మరికొందరు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.