'కన్నప్ప' కోసం అంతమంది రైటర్లు పనిచేసారా!
ఇక కథ విషయంలో విష్ణు చాలా పక్కాగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కథ కోసం దిగ్గజ రచయితలే పనిచేసారు అన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.
By: Tupaki Desk | 26 Sep 2023 1:30 PM GMTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' ఎట్టకేలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ముందుకెళ్తున్నారు. ఏడేళ్ల నుంచి కలలు కంటోన్న ప్రాజెక్ట్ ఇది. ఎట్టకేలకు స్విట్జర్లాండ్ లో షూటింగ్ షురూ చేసారు. భక్తి ప్రధానమైన ఈ సినిమాని 'మహాభారత్' సిరీస్ ఫేం ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. బడ్జెట్ భారీగా కేటాయించినట్లు తెలుస్తోంది.
సినిమాలో పేరున్న నటులు నటిస్తున్నారు. ఇక శివపార్వతి పాత్రల్లో ప్రభాస్-నయనతార నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే! సినిమా రేంజ్ అంతకంతకు మారిపోతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి ఆద్యం పోసింది నటుడు తనికెళ్ల భరణి. ఆయన ఈ సినిమా కథ చెప్పడంతో విష్ణు పూనుకున్నాడు. ఏడేళ్ల క్రితం చెప్పడంతో అప్పటి నుంచి వర్కౌట్ చేస్తుంటే వస్తే ఇప్పటికీ సాధ్యమైంది.
ఇక కథ విషయంలో విష్ణు చాలా పక్కాగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కథ కోసం దిగ్గజ రచయితలే పనిచేసారు అన్న సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది. పరుచూరి గోపాలకృష్ణ..పాన్ ఇండియా గ్రేట్ రచయిత విజయేంద్ర ప్రసాద్.. తోటపల్లి సాయినాధ్.. తోట ప్రసాద్..నాగేశ్వరర్ రెడ్డి..ఈశ్వర్ రెడ్డి తో పాటు ఇంకా మరికొంత మంది రచయితలు ఈ సినిమాకి పనిచేసినట్లు విష్ణు రివీల్ చేసారు.
అయితే ప్రత్యేకంగా విజయేంద్ర ప్రసాద్ ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగడం విశేషమనే చెప్పాలి. ఆయన కథలకు పాన్ ఇండియాలో ఎలాంటి సక్సెస్ రేట్ ఉందో తెలిసిందే. బాలీవుడ్ సినిమాలకు ఎన్నో హిట్ స్టోరీలు అందించారు. బాహుబలి..ఆర్ ఆర్ ఆర్ లాంటి అద్భుత చిత్రాల సృష్టి కర్త ఆయనే. ఈ నేపథ్యం లో 'కన్నప్ప' వెనుక విజయేంద్రుడు ఉండటం అన్నది సంచలన అంశమే. ఆయన స్టాంప్ పడిన స్టోరీకి తిరుగుండదు. విజయం నల్లేరు మీద నడకే అన్న టాక్ మొదలైంది. ఇక సినిమా కోసం బ్యాకెండ్ లో వందలాంది మంది పని చేస్తున్నారు.