కన్నప్ప.. ఇకపై అన్నీ ఆరోజే!
చెప్పాలంటే అది నిజమే.. ప్రమోషన్లు బట్టి కూడా చాలా మంది తొలి రోజు మూవీ చూడాలని ఫిక్స్ అయిపోతుంటారు.
By: Tupaki Desk | 15 Jun 2024 6:54 AM GMTసినిమా తీయడమంతా ఒకెత్తు అయితే.. ప్రమోషన్లు మరో ఎత్తు. అందుకే ఏ మూవీ మేకర్స్ అయినా రిలీజ్ కు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తుంటారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంటారు. అది మూవీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. చెప్పాలంటే అది నిజమే.. ప్రమోషన్లు బట్టి కూడా చాలా మంది తొలి రోజు మూవీ చూడాలని ఫిక్స్ అయిపోతుంటారు.
అయితే ప్రమోషన్లు కూడా ఇప్పుడు రకరకాలుగా చేస్తున్నారు. వినూత్నంగా ఆలోచిస్తున్నారు మేకర్స్. సినీ ప్రియుల దృష్టిని తమ మూవీ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ కల్కి 2898 ఏడీ మూవీ. ఆ సినిమా మేకర్స్.. ఎన్నడూ లేనంత కొత్తగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచుల మధ్య యాడ్స్, బుజ్జి వెహికల్ రివీల్.. అలా అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు హీరో మంచు విష్ణు కూడా తన ప్రమోషనల్ స్ట్రాటజీని చూపిస్తున్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డైలాగ్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తన మూవీ అప్డేట్స్ అన్నీ ఇకపై సోమవారమే ఇస్తామని తెలిపారు విష్ణు. ఈ విషయాన్ని నిన్న జరిగిన టీజర్ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు.
అయితే శివుడికి సోమవారం ప్రీతికరమైనది కనుక.. ఆయన భక్తుడైన కన్నప్ప సినిమా అప్డేట్స్ మండే రోజు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. టీజర్ మాత్రం శుక్రవారం రిలీజ్ అవ్వగా.. మిగతా అప్డేట్స్ అన్నీ సోమవారమే రానున్నట్లు చెప్పారు. సినిమాలోని మిగతా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్, గ్లింప్స్, ట్రైలర్ అలా అన్నీ అప్డేట్లు మండేనే ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక కన్నప్ప అప్డేట్లు మండే ఇవ్వనున్నట్లు.. నాని సరిపోదా శనివారం సినిమా అప్డేట్లు శనివారం ఇస్తున్నారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి అన్నీ అప్డేట్లు కూడా శనివారమే వస్తున్నాయి. త్వరలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా శనివారమే మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో వీక్ స్ట్రాటజీ ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. మొత్తానికి ఆయా సినిమాల మేకర్స్.. ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా నయా ప్లాన్లు గీస్తున్నారు.