Begin typing your search above and press return to search.

సాహో లేడీ 52 వ‌య‌సులో చెల‌రేగిపోయిందిగా

ప్ర‌భాస్ సాహో చిత్రంలో క‌నిపించింది మందిరా భేడి. ఆ చిత్రంలో క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌లో క‌నిపించింది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 2:30 AM GMT
సాహో లేడీ 52 వ‌య‌సులో చెల‌రేగిపోయిందిగా
X

ప్ర‌భాస్ సాహో చిత్రంలో క‌నిపించింది మందిరా భేడి. ఆ చిత్రంలో క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర‌లో క‌నిపించింది. ఇంకా ధృవ, రాధే, భాఘి లాంటి చిత్రాల్లోను న‌టించింది. 90వ దశకంలో శాంతి సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తన నటనతోనే కాకుండా మోడలింగ్, ఫ్యాషన్ డిజైనింగ్‌తో పాటు యాంకరింగ్‌తోనూ ప్రజల మనసులను గెలుచుకుంది. మందిరా చాలా కాలంగా స్క్రీన్ నుండి దూరంగా ఉన్నా సోషల్ మీడియాల్లో తన అభిమానులతో కనెక్ట్ అయి ఉంది. నిరంత‌రం స్పెష‌ల్ ఫోటోషూట్ల‌తో చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది.

52 ఏళ్ల మందిరా ఇప్పుడు మ‌రోసారి తన డ్యాషింగ్ లుక్‌తో విధ్వంసం సృష్టించింది. ఈ ఏజ్ లోను తన అద్భుత‌మైన‌ శైలితో మ్యాజిక్ చేస్తోంది. ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ విషయంలో త‌గ్గేదేలే అంటూ చెల‌రేగిపోతోంది. . అందుకు ఉదాహరణ ఇటీవలి ఈ ఫోటోషూట్. మందిరా తన కొత్త ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా ఇంటర్నెట్‌లో దావానలంలా మారింది. ఫోటోల‌లో మందిరా హాట్‌నెస్‌ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

మందిరా ఈ ఫోటోషూట్ లో బ్రాలెస్ గా క‌నిపించి షాకిచ్చింది. ఈ సీనియ‌ర్ బ్యూటీ పర్పుల్ కలర్ లాంగ్ బ్లేజర్‌ని ధరించింది. ఈ ఫోటోల‌లో కెమెరా ముందు బ్రాలెస్‌గా ఫోజులివ్వడం... బ‌ట‌న్ లెస్ గా త‌న‌లోని రెబ‌ల్ యాటిట్యూడ్ ని ఆవిష్క‌రించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మందిరా కొత్త ఫోటోల‌ను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అప్పుడ‌ప్పుడు న‌టించినా ఏదైనా ప్ర‌త్యేక‌త ఉన్న పాత్ర‌తో ఆక‌ట్టుర‌కోవ‌డం మందిర‌కే చెల్లింది. త‌దుప‌రి ప్రాజెక్టుల గురించి వివ‌రాలు తెలియాల్సి ఉంది.