Begin typing your search above and press return to search.

లెక్క కుదిరితే మంగళవారం కూడా..!

అజ్య భూపతి భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని అర్థమైంది. ఆల్రెడీ ట్రైలర్ తో సినిమాకు సూపర్ బజ్ రాగా ఇప్పుడు పొలిమేర 2 హిట్ అవడంతో మంగళవారం సినిమాకు అది మరింత కలిసి వచ్చింది.

By:  Tupaki Desk   |   4 Nov 2023 2:08 PM GMT
లెక్క కుదిరితే మంగళవారం కూడా..!
X

200 పెట్టి టికెట్ కొని రెండున్నర గంటలు సినిమా చూసే ఆడియన్స్ నచ్చిన సినిమానే చూడాలనే కండీషన్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో వారికి ఉన్న టేస్ట్ కొద్దీ వారు ఆ సినిమాలు చూస్తారు. అయితే రెగ్యులర్ సినిమాల కన్నా హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో వచ్చే సినిమాలు చూసే ఆడియన్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నారు. సినిమా చూసి భయపడాలి.. భయపడేలా చేయాలన్నది వారి ఆలోచన. అలా వాళ్లని భయపెట్టి ఎగ్జైట్ అయ్యేలా చేయగలిగితే చాలు సినిమా హిట్ చేస్తారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ హర్రర్ థ్రిల్లర్ జోనర్ కి తిరిగు ఉండదు.

ఏ జెనరేషన్ అయినా సరే ఇలాంటి సినిమాలు చూస్తారు. ఈ ఇయర్ ఆల్రెడీ విరూపాక్ష సినిమా వచ్చి అలరించింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన విరూపాక్ష సినిమా చాలాకాలం తర్వాత తెలుగు తెర మీద ఒక పర్ఫెక్ట్ హర్రర్ ఫీల్ తెచ్చింది. ఆ సినిమాకు ముందు వచ్చిన మసూద కూడా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యింది. ఇదే దారిలో లేటెస్ట్ గా పొలిమేర 2 సినిమా వచ్చింది. శుక్రవారం కీడా కోలాతో పాటు రిలీజైన పొలిమేర 2 సినిమా టాక్ బాగానే తెచ్చుకుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ చేతబడుల నేపథ్యంతో ఈ సినిమాను దర్శకుడు అనీల్ విశ్వనాథ్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటుగా పొలిమేర 2 గురించి సోషల్ మీడియాలో క్రేజీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత నవంబర్ 17న వస్తున్న మంగళవారం సినిమా కూడా ఇదే నేపథ్యంతో వస్తుంది.

మహాసముద్రం తర్వాత అజయ్ భూపతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా మంగళవారం. ఈ సినిమా కూడా ఊరు అందులో వరుస హత్యల నేపథ్యంతో వస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత మంగళవారం తో అజ్య భూపతి భారీ ప్లానింగ్ తోనే ఉన్నాడని అర్థమైంది. ఆల్రెడీ ట్రైలర్ తో సినిమాకు సూపర్ బజ్ రాగా ఇప్పుడు పొలిమేర 2 హిట్ అవడంతో మంగళవారం సినిమాకు అది మరింత కలిసి వచ్చింది. అజయ్ భూపతి అనుకున్నది అనుకున్న విధంగా తీస్తే మాత్రం మంగళవారం రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ లో వస్తున్న మంగళవారం సినిమా ఆమెకు మరోసారి మంచి పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు.