Begin typing your search above and press return to search.

గుండె మీద చేయి పెట్టి చూడమన్నాడు..!

పాయల్‌ రాజ్‌పూత్‌ హీరోయిన్‌ గా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొంది మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంగళవారం సినిమాకు మంచి రెస్పాన్స్‌ దక్కింది

By:  Tupaki Desk   |   19 Nov 2023 4:04 AM GMT
గుండె మీద చేయి పెట్టి చూడమన్నాడు..!
X

పాయల్‌ రాజ్‌పూత్‌ హీరోయిన్‌ గా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొంది మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంగళవారం సినిమాకు మంచి రెస్పాన్స్‌ దక్కింది. పాజిటివ్ రివ్యూలతో పాటు, వసూళ్లు కూడా యూనిట్‌ సభ్యులు అనుకున్న దాని కంటే చాలా బెస్ట్‌ గా వస్తున్నాయట. మొత్తానికి ఈ ఏడాది చివర్లో వచ్చిన సినిమాల్లో బెస్ట్‌ సినిమాగా ఈ సినిమా నిలిచిందని టాక్‌.

మంగళవారం సినిమా కు వస్తున్న స్పందన చూసి దర్శకుడు అజయ్‌ భూపతి ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమా కంటే బెస్ట్ గా ఈ సినిమాను తీశారు అని ఆయన్ను చాలా మంది అభినందిస్తున్నారట. మధ్య లో మహాసముద్రం సినిమాను రూపొందించిన దర్శకుడు అజయ్‌ భూపతి ఫెయిల్ అయ్యాడు. అయితే ఈ సినిమా బెస్ట్‌ గా నిలిచింది.

పాయల్‌ రాజ్ పూత్‌ నటనతో మెప్పించడంతో పాటు, దర్శకుడి యొక్క టేకింగ్‌, సినిమాటోగ్రఫీ మరియు నేపథ్య సంగీతం ఇలా ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా సెట్‌ అవ్వడంతో మంగళవారం సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చింది. సినిమాకు పెద్ద ఎత్తున పెయిడ్‌ ప్రీమియర్‌ లు వేయడం జరిగింది.

సినిమాకు పెయిడ్‌ ప్రీమియర్‌ లు వేయడం ఈ మధ్య కాలం లో చాలా రేర్‌ గా చూస్తూ ఉన్నాం. సినిమా ఫలితం తేడా వస్తే చాలా డేంజర్‌. అలాంటిది మంగళవారం సినిమాపై నమ్మకంతో మేకర్స్‌ ఈ సినిమా పెయిడ్‌ ప్రీమియర్‌ లు వేశారు. ప్రీమియర్‌ షో లకు వచ్చిన రెస్పాన్స్ గురించి దర్శకుడు అజయ్‌ భూపతి తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

ప్రీమియర్ లు చూసిన చాలా మంది ప్రేక్షకులు సినిమా చాలా బాగుందని అన్నారు. ఒక ప్రేక్షకుడు నా చేయి తన గుండె మీద పెట్టి చూడమన్నాడు. సినిమా పట్ల తన అభిప్రాయం ను మాటల్లో చెప్పలేను అంటూ అతడు పేర్కొన్నాడు. ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ గురించి కూడా చాలా మంది అభినందించారని అజయ్‌ భూపతి పేర్కొన్నాడు.