Begin typing your search above and press return to search.

అజయ్‌ భూపతి ఆవేదనలో అర్థం ఉంది..!

ఆర్ఎక్స్‌ 100 సినిమాతో దర్శకుడిగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్‌ ను దక్కించుకున్న అజయ్‌ భూపతి రెండో ప్రయత్నం మాత్రం విఫలం అయింది

By:  Tupaki Desk   |   19 Nov 2023 9:49 AM IST
అజయ్‌ భూపతి ఆవేదనలో అర్థం ఉంది..!
X

ఆర్ఎక్స్‌ 100 సినిమాతో దర్శకుడిగా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్‌ ను దక్కించుకున్న అజయ్‌ భూపతి రెండో ప్రయత్నం మాత్రం విఫలం అయింది. మహాసముద్రం సినిమా నిరాశ పరచడంతో అజయ్‌ భూపతికి అంత సీన్ లేదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ తన సత్తాను అజయ్‌ భూపతి మంగళవారం సినిమాతో నిరూపించుకున్నాడు.

పాయల్‌ రాజ్ పూత్‌ ప్రధాన పాత్రలో రూపొందిన మంగళవారం సినిమాకు మెజార్టీ రివ్యూవర్స్ పాజిటివ్‌ రివ్యూలను ఇవ్వడం జరిగింది. ఇక ఈ సినిమా యొక్క వసూళ్లు కూడా రివ్యూలకు తగ్గట్లుగా పాజిటివ్‌ గా ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా లోని కొన్ని మలుపులు మరియు సస్పెన్స్‌ ఎలిమెంట్స్ ను రివ్యూవర్స్‌ మరియు ప్రేక్షకులు సోషల్‌ మీడియా ద్వారా రివీల్‌ చేయవద్దని దర్శకుడు అజయ్‌ భూపతి మొదటి నుంచి విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు.ఆయన విజ్ఞప్తి మేరకు చాలా మంది రివ్యూవర్స్‌ కథ లో ట్విస్ట్‌ లు మరియు సస్పెన్స్‌ ఎలిమెంట్స్ ను రివీల్‌ చేయకుండా విశ్లేషించారు.

ఒక వీడియో రివ్యూవర్‌ మాత్రం సినిమాలోని అన్ని ట్విస్ట్ లను మరియు సస్పెన్స్‌ ఎలిమెంట్స్ ని రివీల్ చేస్తూ రివ్యూ ఇచ్చాడు. దాంతో ఆ రివ్యూవర్‌ పై దర్శకుడు అజయ్‌ భూపతి అసహనం వ్యక్తం చేశాడు. సస్పెన్స్‌ ను రివీల్‌ చేయకుండా చాలా మంది రివ్యూవర్స్‌ లోతైన రివ్యూలు ఇచ్చారు. కానీ ఆయన మాత్రం సినిమా ని స్పాయిల్‌ చేశాడంటూ దర్శకుడు అజయ్‌ భూపతి ఆగ్రహంగా ఉన్నాడు.

చాలా కష్టపడి చేసిన సినిమా విషయంలో అది కూడా హిట్ టాక్ వచ్చిన సినిమా కు ఇలాంటివి చేయడం ఏ మాత్రం సరి కాదు. ఆ విషయం లో అజయ్‌ భూపతి సదరు రివ్యూవర్‌ పై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడం సమంజసం అని కొందరు, దర్శకుడు అజయ్‌ భూపతి ఆవేదనలో అర్థం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.