భయపెట్టి, పరుగులు పెట్టించే మంగళవారం… ట్రైలర్ టాక్
అక్కడి నుంచి గ్రామంలోకే తీసుకెళ్ళి ప్రతి మంగళవారం గ్రామంలో హత్యలు జరుగుతూ ఉన్నాయని విజువల్, డైలాగ్స్ తో ఎలివేట్ చేశారు.
By: Tupaki Desk | 21 Oct 2023 7:29 AM GMTఆర్ఎక్స్ 100 సినిమా ట్రైలర్ తో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడిగా అజయ్ భూపతికి మంచి ఇమేజ్ ఉంది. అయితే నెక్స్ట్ చాలా గ్యాప్ తీసుకొని మహా సముద్రం అనే మల్టీ స్టారర్ మూవీ చేచేశారు. మూడో ప్రయత్నంలో మళ్ళీ తనని తాను షోఅప్ చేసుకోవడానికి పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో మంగళవారం అనే మూవీతో రాబోతున్నాడు.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ చేస్తోంది. అలాగే నందిత శ్వేతా పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తోంది. చైతన్య కృష్ణ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
కాంతారా సినిమాకి సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ మంగళవారం ట్రైలర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళింది. ఓపెన్ సీన్ లోనే చీకట్లో ఓ వ్యక్తికి అమ్మవారి అవతారంలో ఎవరో చెట్టుమీద కూర్చొని భయపెడతారు. అక్కడి నుంచి గ్రామంలోకే తీసుకెళ్ళి ప్రతి మంగళవారం గ్రామంలో హత్యలు జరుగుతూ ఉన్నాయని విజువల్, డైలాగ్స్ తో ఎలివేట్ చేశారు.
మాలచ్చమ్మ అమ్మకి ఇష్టమైన మంగళవారం హత్యలు జరగడం గ్రామంలో మిస్టరీగా మారుతుంది. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో అనేది ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ గా నందిత శ్వేతా పాత్రని రివీల్ చేశారు. అలాగే క్రూరమైన వ్యక్తిగా చైతన్య కృష్ణ పాత్రని ఎలివేట్ చేశారు. శ్రీతేజ్ ని కూడా విలన్ గా చూపించారు.
ఈ పాత్రల మధ్య పోరాటం, సంఘర్షణ, అసలు గ్రామంలో జరుగుతున్న దారుణాల వెనుక ఎవరున్నారు తెలుసుకోవడం వంటివి ట్రైలర్ లో ఆవిష్కరించారు. ఫైనల్ గా పాయల్ రాజ్ పుత్ ని రివీల్ చేసి ఆమెని ఎవరూ అనుభవిస్తున్నట్లు చూపించారు. తరువాత చిత్రహింసలు పెట్టడం ప్రెజెంట్ చేశారు. మధ్యలో అజ్మల్ పాత్ర ఏంటి అనేది రివీల్ చేయలేదు. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే హర్రర్, థ్రిల్లర్, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు టెన్షన్ క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఇంటరెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. స్వాతి గునంపాటి, సురేష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 17న థియేటర్స్ లోకి రాబోతోంది. కాతారా తరహాలో ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లో మాయ చేస్తుందేమో అనేది వేచి చూడాలి.