Begin typing your search above and press return to search.

మంగళవారంతో మళ్లీ వార్తల్లో అతడు..!

పాయల్‌ రాజ్ పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంగళవారం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.

By:  Tupaki Desk   |   18 Nov 2023 4:42 AM GMT
మంగళవారంతో మళ్లీ వార్తల్లో అతడు..!
X

పాయల్‌ రాజ్ పూత్‌ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొంది తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంగళవారం సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. చాలా రివ్యూల్లో బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ అద్భుతం అంటూ పేర్కొన్నారు. దాంతో మంగళవారం సినిమా యొక్క సంగీత దర్శకుడు ఎవరు అంటూ ఇప్పుడు సోషల్‌ మీడియాతో పాటు మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.

మంగళవారం సినిమాకు అజనీష్ లోక్‌నాథ్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ అందించాడు. పలు సన్నివేశాల్లో ఇతగాడి బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉండటంతో సినిమా కి పాజిటివ్ టాక్ రావడం లో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు అజనీష్ లోక్‌నాథ్ మోస్ట్‌ వాంటెడ్‌ మ్యూజిక్ డైరెక్టర్‌ గా మారిపోయాడు.

ఈ సినిమాకు ముందు అజనీష్‌ కాంతార మరియు విరూపాక్ష సినిమాలకు నేపధ్య సంగీతాన్ని అందించాడు. ఆ సినిమాల విజయం లో కూడా ఇతని బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ చాలా కీలకం అనడంలో సందేహం లేదు. కన్నడం లో చాలా సినిమాలకు సంగీతాన్ని అందించినప్పటికి హర్రర్‌ సినిమాలతోనే ఇతడికి మంచి పేరు లభించింది.

అందుకే ఏ దర్శకుడు లేదా నిర్మాత హర్రర్‌ కాన్సెప్ట్‌ లేదా స్పెషల్‌ కాన్సెప్ట్‌ తో సినిమాను అనుకుంటున్నారు అంటే కచ్చితంగా సంగీత దర్శకుడిగా అజనీష్‌ లోక్‌నాథ్‌ కావాలని కోరుకుంటున్నారు. థ్రిల్లర్‌ సినిమాల్లో ఇతగాడి నేపథ్య సంగీతం ప్రేక్షకులను కుర్చీల అంచుల్లో కూర్చునేలా చేస్తుంది అనడంలో సందేహం లేదు.

కాంతార మరియు విరూపాక్ష సమయంలో నేపథ్య సంగీతం గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. ఇప్పుడు మంగళవారం సినిమాలోని నేపథ్య సంగీతం చాలా బాగా రావడంతో మరోసారి ఈ సంగీత దర్శకుడి పేరు సోషల్‌ మీడియాతో పాటు అన్ని చోట్ల కూడా మారుమ్రోగుతోంది.