Begin typing your search above and press return to search.

'మంగళవారం' లో పాయల్‌ చాలా తేడా..!

ఇప్పుడు మంగళవారం సినిమాలోని పాయల్‌ పాత్ర కూడా అదే రేంజ్ లో ఉంటుందట. ఈ చిత్రంలో పాయల్‌ అరుదైన వ్యాధితో బాధ పడుతూ ఉంటుందట.

By:  Tupaki Desk   |   9 Nov 2023 1:30 PM GMT
మంగళవారం లో పాయల్‌ చాలా తేడా..!
X

పాయల్ రాజ్ పూత్‌ కీలక పాత్రలో ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'మంగళవారం'. ఈ సినిమా పై మొన్నటి వరకు పెద్దగా జనాల్లో అంచనాలు ఆసక్తి లేదు. కానీ గత రెండు వారాలుగా సినిమా గురించి చేస్తున్న ప్రచారం, మరియు జరుగుతున్న ప్రచారం కారణంగా అంచనాలు ఆకాశానికి తాకేలా వస్తున్నాయి.

మంగళవారం సినిమాలో పాయల్ రాజ్ పూత్‌ పాత్ర గురించి ఆసక్తికర పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దర్శకుడు అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాలో పాయల్‌ రాజ్‌ పూత్‌ ను హీరోయిన్‌ గా చూపిస్తూనే నెగటివ్‌ షేడ్స్ తో చూపించాడు. దాంతో ఆ సినిమా పాయల్ రాజ్ పూత్‌ కెరీర్‌ కి ఏ స్థాయిలో బూస్ట్‌ ను ఇచ్చిందో అందరికి తేల్చిందే.

ఇప్పుడు మంగళవారం సినిమాలోని పాయల్‌ పాత్ర కూడా అదే రేంజ్ లో ఉంటుందట. ఈ చిత్రంలో పాయల్‌ అరుదైన వ్యాధితో బాధ పడుతూ ఉంటుందట. ఆ సమస్య కారణంగా పాయల్ చిత్ర విచిత్రంగా, చాలా తేడాగా ప్రవర్తిస్తూ ఉంటుందని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

మొత్తానికి పాయల్‌ కి ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత మళ్లీ తన నట విశ్వరూపం చూపించే విధంగా అవకాశం అయితే లభించింది. తాను ఈ అవకాశంను సద్వినియోగం చేసుకుంది అంటూ ప్రమోషన్‌ సందర్భంగా యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న విడుదల అవ్వబోతున్న మంగళవారం సినిమా పాయల్ కి మళ్లీ బూస్ట్‌ ఇచ్చి వరుస సినిమాల్లో నటించేలా చేసేనా చూడాలి.