Begin typing your search above and press return to search.

హెబ్బా 'ధూంధాం' పెళ్లి పాట.. స్పెషల్ అట్రాక్షన్ గా మంగ్లీ

కుమారి 21 ఎఫ్ మూవీతో బ్యూటీ హెబ్బా పటేల్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Jun 2024 11:44 AM GMT
హెబ్బా ధూంధాం పెళ్లి పాట.. స్పెషల్ అట్రాక్షన్ గా మంగ్లీ
X

కుమారి 21 ఎఫ్ మూవీతో బ్యూటీ హెబ్బా పటేల్ ఎలాంటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. అంతకు ముందు ఓ సినిమాలో యాక్ట్ చేసినా.. ఈ చిత్రంతో ఫుల్ ఫాలోయింగ్ దక్కించుకుంది. కానీ ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా.. కుమారి 21 ఎఫ్ రేంజ్ హిట్ అందుకోలేకపోయింది. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా సహా వివిధ సినిమాల్లో నటించినా.. బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది.

ఇప్పుడు హెబ్బ.. తెలుగులో గట్టి బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తోంది. వరుస అవకాశాలు దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ధూంధాం చిత్రంలో నటిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో చేతన్ కృష్ణకు జోడీగా యాక్ట్ చేస్తోంది. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో హెబ్బా పటేల్ ట్రెడిషనల్ గా కనిపించింది.

ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే గ్రాండ్ గా థియేటర్లో విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ మల్లెపూల టాక్సీని ఈరోజు రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ప్రోమో కూడా రిలీజ్ చేశారు. చెప్పినట్లే బుధవారం ఉదయం ఫుల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.

మల్లెపూల టాక్సీ సాంగ్ కు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ క్యాచీ బీట్ తో కంపోజ్ చేశారు. సింగర్స్ మంగ్లీ, సాహితీ చాగంటి తమ గాత్రంతో ప్రాణం పోశారు. నూటొక్క జిల్లాల అందగాడే.. మ ఇంటి పిల్లకి నచ్చేసినాడే అంటూ సాగుతున్న ఈ పెళ్లి పాటను పాడడమే కాదు.. మంగ్లీ స్పెషల్ అట్రాక్షన్ గా సాంగ్ లో నిలిచింది. తన డ్యాన్స్ అండ్ ఎక్సప్రెషన్స్ తో అదరగొట్టింది.

అయితే రామజోగయ్య శాస్త్రి సాంగ్ ను షేర్ చేసి.. మంగ్లీ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి షాక్ అయ్యానని పోస్ట్ పెట్టారు. ఈ పాట మోత మోగకపోతే నన్నడగండి అంటూ రాసుకొచ్చారు. సినిమాలో వెన్నెల కిషోర్ పెళ్లి సమయంలో పాట రానున్నట్లు తెలుస్తోంది. చేతన్, హెబ్బా క్యూట్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటున్నారు. మొత్తానికి సాంగ్ అంతా బాగుంది. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ ఈ మూవీని నిర్మిస్తుండ‌గా.. గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.