Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8: మణికంఠ రెమ్యూనరేషన్ ఎంత..?

బిగ్ బాస్ సీజన్ 8లో లాస్ట్ వీక్ నాగ మణికంఠ సెల్ఫ్ నామినేట్ అయ్యాడని తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Oct 2024 5:20 AM GMT
బిగ్ బాస్ 8: మణికంఠ రెమ్యూనరేషన్ ఎంత..?
X

బిగ్ బాస్ సీజన్ 8లో లాస్ట్ వీక్ నాగ మణికంఠ సెల్ఫ్ నామినేట్ అయ్యాడని తెలిసిందే. హౌస్ లో తన కన్ ఫ్యూజన్ తో ఇన్నాళ్లు నెట్టుకొచ్చిన మణికంఠ ఇక నా వల్ల కాదని చెప్పేసి సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి వారం నుంచి ఆడియన్స్ అటెన్షన్ పొందేందుకు మణికంఠ బాగా పయత్నించాడు. మొదటి రోజు హౌస్ లోకి వెళ్లగానే అనీల్ రావిపుడి అతన్ని బయటకు తీసుకొద్దామని ట్రై చేసే సరికి అఖిల బ్రహ్మాండ కోటి అంటూ తన ఆవేశాన్ని చూపించాడు.

ఇక మొదటి నామినేషన్స్ లో తన సాడ్ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పి హౌస్ మెట్స్ ని కన్ ఫ్యూజన్ లో పడేశాడు. ప్రతి టాస్క్ లో కూడా తనవరకు చేతనైంది చేసి ఆ తర్వాత చేతులు ఎత్తేశాడు మణికంఠ. ఐతే ఏం చేసినా ఎలా చేసినా ఆడియన్స్ లో మణికంఠ మీద ఒక పాజిటివిటీ వచ్చింది. తను ఇంకాస్త ట్రై చేసి ఉంటే కచ్చితంగా టాప్ 5 దాకా వెళ్లగలిగే ఛాన్స్ ఉండేది. కానీ మధ్యలోనే అతను సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మణికంఠ వారానికి 1.75 లక్షల పారితోషికంతో వచ్చాడని తెలుస్తుంది. తను 7 వారాల పాటు ఉన్నాడు. దాదాపు 12 లక్షల దాకా రెమ్యునరేషన్ గా పొందాడని తెలుస్తుంది. హౌస్ లో చాలాసార్లు ఐదు వారాలు ఉంటే చాలని అనుకున్న మణికంఠ ఏడో వారం అది కూడా తను ఆడియన్స్ చేత సేఫ్ అయినా కూడా తనంతట తానే సెల్ఫ్ ఎలిమినేట్ చేసుకుని వచ్చాడు. ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే హమ్మయ్య రిలాక్స్ అనుకున్నాడు.

బిగ్ బాస్ హౌస్ లో తన భార్య పాప తనని దూరం పెట్టారని చెప్పిన మణికంఠ బయటకు వచ్చాక వారి నుంచి ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మణికంఠ కొద్దిగా ఓపికగా ఉండి ఉంటే అతను హౌస్ లో ఇంకొన్నాళ్లు సర్వైవ్ అవ్వగలిగే వాడని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఉన్నంతలో తన ఆట తను ఆడిన మణికంఠ ఆడియన్స్ లో కొంత బజ్ తెచ్చుకోగలిగాడు.