ఔత్సాహికులతో మణిరత్నం మార్క్ మరో లవ్ స్టోరీ!
ఆ రకంగా మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో మణిరత్నం మార్క్ లవ్ స్టోరీ మిస్ అవుతున్నామనే వర్గం మాత్రం అలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. తాజాగా అలాంటి వారికి మణిసార్ గుడ్ న్యూస్ చెప్పేసారు.
By: Tupaki Desk | 24 Jan 2025 9:30 AM GMTవెండి తెరపై మణిరత్నం మార్క్ లవ్ స్టోరీ పడి చాలా కాలమవుతోంది. `ఒకే బంగారం` తర్వాత అలాంటి అటెంప్ట్ మళ్లీ చేయలేదు. `ఒకే బంగారం` చిత్రాన్ని 6 కోట్ల లో నిర్మించి 60 కోట్ల వసూళ్లను సాధించింది. అటుపై కార్తీ, అతిది రావు హైదరీతో రొమాంటిక్ వార్ బ్యాక్ డ్రాప్ లో `చెలియా` చిత్రాన్ని తెరెక్కించారు గానీ, అంచనాలు అందుకోలేదు. ఆ తర్వాత `పొన్నియన్ సెల్వన్` రెండు భాగాలతో బిజీ అయ్యారు. దాదాపు ఐదారేళ్ల పాటు ఈ ప్రాజెక్ట్ పైనే పని చేసారు.
ఆ రకంగా మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో మణిరత్నం మార్క్ లవ్ స్టోరీ మిస్ అవుతున్నామనే వర్గం మాత్రం అలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. తాజాగా అలాంటి వారికి మణిసార్ గుడ్ న్యూస్ చెప్పేసారు. `థగ్ లైఫ్` రిలీజ్ అనంతరం ఓ చిన్న బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించారు. ఇక్కడ మరో సర్ ప్రైజ్ విషయం ఏంటి అంటే ఆ సినిమాలో హీరో, హీరోయిన్లు అంతా కొత్త వారే ఉంటారని అంటున్నారు.
దీంతో న్యూ ట్యాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ మణిరత్నం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన దర్శక త్వంలో ఛాన్స్ వచ్చిందంటే అంతకు మించిన అదృష్ట వంతులు ఉండరు. ఒక్క సినిమాతో పాన్ ఇండియాలో ఫేమస్ అవుతారు. యూత్ లో క్రేజీ స్టార్లగా మారిపోతారు. మరి ఆ అదృష్టవంతులు ఎవరవుతారో చూడాలి. చాలా తక్కువ బడ్జెట్ లోనే మణిరత్నం ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తారు.
ప్రస్తుతం మణిరత్నం విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా `థగ్ లైఫ్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం మణిరత్నం కొత్త ప్రాజెక్ట్ పనుల్లో బిజీ కానున్నారు.