Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమా లేనట్టేనా..?

సూపర్ స్టార్ రజిని తన సినిమాల వేగాన్ని పెంచారు. వరుస సక్సెస్ లు ఆయనలో జోష్ పెంచాయి.

By:  Tupaki Desk   |   16 Oct 2024 10:30 AM GMT
సూపర్ స్టార్ సినిమా లేనట్టేనా..?
X

సూపర్ స్టార్ రజిని తన సినిమాల వేగాన్ని పెంచారు. వరుస సక్సెస్ లు ఆయనలో జోష్ పెంచాయి. రజినీకాంత్ ఇటీవలే వేటయ్యన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. టీ జే జ్ఞానవేల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. జైలర్ తర్వాత రజిని చేసిన ఈ సినిమా కూడా ఆ సక్సెస్ మేనియాను కొనసాగించింది. వేటయ్యన్ తర్వాత రజినీ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కూలీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున కూడా నటించడం వల్ల సినిమాపై క్రేజ్ డబుల్ అయ్యింది.

ఇక ఇదిలా ఉంటే సూపర్ స్టార్ రజినీకాంత్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో ఒక సినిమా వస్తుందని వార్తలు ఊపందుకున్నాయి. వారిద్దరి నుంచి ఈ వార్తలపై రెస్పాన్స్ రాకపోవడంతో అది నిజమే అని అనుకున్నారు. కానీ మణిరత్నం సతీమణి సీనియర్ హీరోయిన్ సుహాసిని ఈ వార్తలపై స్పందించారు. రజిని, మణిరత్నం కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రావట్లేదని ఆమె అన్నారు. మణిరత్నం తో రజిని సినిమా ఉంటుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కి సుహాసిని క్లారిటీ కాస్త ఇబ్బంది కలిగించినా ఆ వార్తల్లో నిజం లేదన్న క్లారిటీ వచ్చినందుకు రిలాక్స్ ఫీల్ అవుతున్నారు.

రీసెంట్ గా ఒక స్పెషల్ చిట్ చాట్ జరిపిన ఆమె మణిరత్నం రజిని సినిమా అసలు డిస్కషన్ లో కూడా లేదని అన్నారు. ఎవరో ఇలాంటి వార్తలను సృష్టిస్తారని అన్నారు. రజిని, మణిరత్నం సినిమాకు సంబందించిన అప్డేట్ కూడా ఈ రూమర్స్ సృష్టించిన వారినే అడగండని అన్నారు సుహాసిని. ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు.

నాయకన్ తర్వాత కమల్ తో దాదాపు 3 దశాబ్దాల తర్వాత మణిరత్నం ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. విక్రం బ్లాక్ బస్టర్ కొట్టడంతో వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్న కమల్ హాసన్ ఇండియన్ 2 డిజాస్టర్ అయినా కూడా థగ్ లైఫ్ తో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నారు. మణిరత్నం కమల్ మరోసారి ఆ హిట్ మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాలి. సూపర్ స్టార్ రజిని కూడా కూలీ తర్వాత ఇద్దరు యువ దర్శకులతో కథా చర్చల్లో ఉన్నారని తెలుస్తుంది. న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అయితే కొత్త కథలతో వస్తారని సూపర్ స్టార్ ఇలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.