Begin typing your search above and press return to search.

మణిరత్నం సినిమాకి నో చెప్పిన హీరోయిన్..!

ఇండియన్ దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు

By:  Tupaki Desk   |   11 Jun 2024 5:45 AM GMT
మణిరత్నం సినిమాకి నో చెప్పిన హీరోయిన్..!
X

ఇండియన్ దిగ్గజ దర్శకుల్లో మణిరత్నం ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రూపొందించిన తమిళ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు అంటున్నాం కానీ, అప్పట్లోనే మణిరత్నం చేసిన అన్ని సినిమాలు అన్ని భాషల్లో డబ్‌ అయ్యి మంచి వసూళ్లు నమోదు చేశాయి.

సౌత్‌ తో పాటు బాలీవుడ్‌ లో ప్రతి ఒక్క హీరో హీరోయిన్‌ మణిరత్నం దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్న రోజుల్లో సోనమ్‌ కపూర్‌ ఆయన ఆఫర్‌ ను తిరస్కరించిందట. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2013లో వచ్చిన ఆ సినిమాలో గౌతమ్ కార్తీక్ హీరోగా నటించాడు.

కడలి సినిమాను మొదలు పెట్టే సమయంలో హీరోయిన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ ముద్దుగుమ్మను మణిరత్నం నటింపజేయాలని భావించాడు. అందుకోసం చర్చలు కూడా జరిగాయి. సోనమ్‌ కపూర్ అయితే తన సినిమాకు యాప్ట్‌ అనుకున్న మణిరత్నం ఆమెను సంప్రదించాడట.

సోనమ్‌ కపూర్‌ తండ్రి అనీల్ కపూర్‌ ని కూడా మణిరత్నం ఆ సమయంలో సంప్రదించాడని సమాచారం. సోనమ్‌ కపూర్‌ కొన్ని కారణాలు చెప్పి మణిరత్నం సినిమాకు నో చెప్పిందట. ఆ సమయంలో అనీల్ కపూర్‌ కూడా కూతురును ఒప్పించేందుకు ప్రయత్నించాడని, అయినా కూడా ఆమె ఆ సమయంలో సౌత్‌ సినిమాలపై ఆసక్తి చూపించలేదని టాక్‌.

ఈ మధ్య కాలంలో మణిరత్నం సినిమాలు మళ్లీ పాన్ ఇండియా స్థాయిలో సందడి చేస్తున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.