Begin typing your search above and press return to search.

విజయ్ - మహేష్ మల్టీస్టారర్.. జస్ట్ మిస్!

చోళుల కథతో ఈ మూవీ తెరకెక్కింది. నిజానికి ఈ సినిమాని 2010లో తెరకెక్కించాలని మణిరత్నం అనుకున్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 7:42 AM GMT
విజయ్ - మహేష్ మల్టీస్టారర్.. జస్ట్ మిస్!
X

మణిరత్నం దర్శకత్వంలో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ హీరోలుగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ కి యావరేజ్ టాక్ వచ్చింది. ఐశ్వర్య రాజ్, త్రిష, శోభిత దూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు. మూవీలో చేసిన యాక్టర్స్ అందరికి మంచి పేరు వచ్చింది. అయితే ఈ సిరీస్ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ అందుకోలేదు. తమిళంలో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.

చోళుల కథతో ఈ మూవీ తెరకెక్కింది. నిజానికి ఈ సినిమాని 2010లో తెరకెక్కించాలని మణిరత్నం అనుకున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమాని చేయాలని ప్లాన్ చేశారు. నిజానికి తెలుగు, తమిళ హీరోల కలయికతో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఈ మూవీ చేయాలని అనుకున్నారంట. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇళయ దళపతి విజయ్ మెయిన్ లీడ్ రోల్స్ కోసం ఫైనల్ చేసారంట.

తరువాత ఫోటోషూట్ కూడా జరిగిందంట. అయితే తరువాత ఏమైందో ఈ సినిమా పట్టాలు ఎక్కలేదు. విఎఫ్ఎక్స్, బడ్జెట్ సమస్యల కారణంగా ఆ మూవీ ఆగిపోయినట్లు టాక్ నడిచింది. మరల దశాబ్దకాలం తర్వాత మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియన్ సెల్వన్ సిరీస్ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దీనికంటే ముందుగా మణిరత్నం నవాబ్ అనే సినిమాని కూడా చేశారు. ఆ సినిమా కథ ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య వారసత్వం జరిగే ఆధిపత్య పోరుగా ఉంటుంది.

ఈ చిత్రాన్ని కూడా తెలుగు, తమిళ్ స్టార్ హీరోలతో కలిసి చేయాలని మణిరత్నం అనుకున్నారు. అది కూడా సాధ్యం కాలేదు. తరువాత తమిళ హీరోలతోనే ఆ సినిమా చేశారు. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం మణిరత్నం కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే సంవత్సరం ఆరంభంలో మూవీ థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సోలోగా అయిన మణిరత్నం మూవీ చేయాలని అనుకున్నారు. అది కూడా వీలుకాలేదు. భవిష్యత్తులో అయిన సాధ్యం అవుతుందా లేదా అనేది చెప్పలేం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు జక్కన్నతో పాన్ వరల్డ్ చిత్రం చేస్తున్నారు. దీని తర్వాత మహేష్ బాబు ఇమేజ్ పెరిగిపోతుంది.