50 తర్వాతే నచ్చినట్టు జీవించగలం.. సీనియర్ నటి!
సీనియర్ నటి మనీషా కొయిలారా కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `హీరామండి: ది డైమండ్ బజార్`లో నటించారు.
By: Tupaki Desk | 28 Nov 2024 3:50 AM GMTసీనియర్ నటి మనీషా కొయిలారా కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన `హీరామండి: ది డైమండ్ బజార్`లో నటించారు. ఇది OTTలోకి మనీషా అరంగేట్రం. ఈ సిరీస్‌లో మల్లికాజాన్ అనే వ్యభిచార గృహం మేడమ్ పాత్రను పోషించారు. బ్రిటిష్ ఇండియాలో జరిగిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. ప్రస్తుతం `హీరామండి: ది డైమండ్ బజార్` రెండవ సీజన్ చిత్రీకరణ గురించి అప్ డేట్ రావాల్సి ఉంది. ఇంతలోనే ఇఫీ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న మనీషా అక్కడ మీడియాతో ముచ్చటించింది. నటరంగంలో నటీమణులకు ప్రాధాన్యత పెరిగిందని, ఓటీటీ రాకతో అంతా మారిందని మనీషా వ్యాఖ్యానించారు.
ఇంతలోనే ఇప్పుడు మనీషా తాజా ఇన్ స్టా పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఎవరి జీవితం అయినా 50 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది. లైఫ్ స్పాన్ లో అత్యుత్తమ భాగం అదే. స్వేచ్ఛ పరంగా.. ఆర్థికంగా స్థిరత్వం పరంగా లేదా అభిరుచులను కొనసాగించే సౌలభ్యం పరంగా ప్రతిదీ నచ్చినట్టు వీలుపడుతుందని మనీషా అభిప్రాయపడ్డారు. స్వీయ నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడానికి మీకు స్వేచ్ఛ, ఆర్థిక సౌలభ్యం ఉండే దశ ఇదేనని మనీషా కొయిలారా విశదపరిచింది.
``ఇది మీరు మీ కష్టానికి ప్రతిఫలాన్ని పొందే దశాబ్దం.. మీ కలలను కొనసాగించండి .. జీవితాన్ని నచ్చినట్టు ఒక ఉద్దేశ్యంతో జీవించండి`` అని మనీషా సూచించింది. క్యాన్సర్ లాంటి మహమ్మారీని ఎదుర్కొని మృత్యుంజయురాలు అయ్యాక.. ఫ్యామిలీ లైఫ్ స్ట్రగుల్ ని ఎదుర్కొన్న తర్వాత కూడా.. 50 వయసులో మనీషా కొయిలారా పాజిటివ్ ధృక్పథం అందరిలో స్ఫూర్తి నింపుతోంది.