స్టార్ హీరోయిన్ పబ్లిగ్గా మందు కొట్టి సిగరెట్ తాగడం వెనక కారణం?
తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభం చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా యరొగెంట్ గా ఉన్నానని మనీషా కొయిలారా అంగీకరించారు.
By: Tupaki Desk | 11 Jan 2025 11:30 AM GMTనాగార్జున సరసన క్రిమినల్, అరవింద స్వామి సరసన బొంబాయి వంటి చిత్రాల్లో నటించింది మనీషా కొయిలారా. `ఒకే ఒక్కడు`లో యాక్షన్ కింగ్ అర్జున్ సరసన కథానాయికగా నటించింది. ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో వేశ్య పాత్రతోను విస్మయపరిచింది. తనదైన అందం, అద్భుత అభినయంతో యువతరం హృదయాలను కొల్లగట్టిన మనీషా కొయిలారా తన జీవితంలో ఉత్థాన పతనాలున్నాయని అంగీకరించింది.
తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభం చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా యరొగెంట్ గా ఉన్నానని మనీషా కొయిలారా అంగీకరించారు. నేనే ఈ భూమికి కేంద్రక ఆకర్షణ అనుకునేదానిని. కానీ అంత సీన్ లేదని తర్వాత అర్థమైందని అన్నారు. అంతగా పరణతి చెందని వయసు ఫలితం ఇది అని మనీషా కొయిలారా వ్యాఖ్యానించారు.
ఇటీవలి ఓ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో పురుషాధిక్య పరిశ్రమలో ద్వంద్వ ప్రమాణాల గురించి కూడా మనీషా ప్రస్తావించింది. ఈ రంగంలో చాలా విషయాల్లో మగ నటులదే తుది నిర్ణయం అని చెప్పారు. పరిశ్రమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం ద్వారా తాను ఎలా మార్గాన్ని సుగమం చేసుకుందో కూడా తెలిపారు. నేను నడిచే దారిలో ద్వంద్వ ప్రమాణాలను ద్వేషించాను.. తిరుగుబాటుతోనే ప్రతిదీ సాధించుకున్నాను అని మనీషా వెల్లడించింది.
`మన్` షూటింగ్ సమయంలో సొంతంగా మహిళా మేకప్ ఆర్టిస్ట్‌ను నియమించుకుని తాను కోరుకున్న మార్పును ప్రారంభించానని మనీషా కొయిలారా తెలిపారు. ఒకప్పుడు మగవాడు మాత్రమే మేకప్ ఆర్టిస్ట్‌గా ఉండే యూనియన్ ఉండేది. హెయిర్ డ్రస్సర్ స్త్రీ అయి ఉండాలి. అయితే నేను చాలా బాగా మేకప్ చేయగల ఒక మహిళను కలిశాను. కాబట్టి ఆమె మేకప్ ఎందుకు చేయకూడదు? అని అడిగాను`` అని గుర్తు చేసుకుంది.
ఎవరైనా మొదటి అడుగు వేస్తే మార్పు సాధ్యమని కూడా మనీషా వ్యాఖ్యానించారు. అయితే హీరోలు సెట్లో ఉన్నప్పుడు షాట్‌ను నిర్ణయిస్తారని.. పారితోషికంలోను డామినేషన్ ఉంటుందని మనీషా అన్నారు. ధూమపానం, మద్యపానం హీరో చేసినా ఫర్వాలేదు.. అదే పని ఒక మహిళ చేస్తే అప్పట్లో విమర్శలు ఎదుర్కొనేవారని కూడా మనీషా అన్నారు. నేను నిజంగా గొప్పవి కాని చాలా పనులు చేయడం ప్రారంభించానని కూడా నిజాయితీగా అంగీకరించారు. ఇలాంటి విషయాల్లో తనను ప్రశ్నించినప్పుడు ప్రతిదానిపైనా తిరుగుబాటు చేసి బహిరంగంగా అలా చేయడం ప్రారంభించానని మనీషా చెప్పారు.